అగ్ర దర్శకుడి క్రేజీ ప్రాజెక్ట్ వివాదంపై పరిష్కారం దొరికేనా..?

Update: 2021-06-30 11:30 GMT
'ఇండియన్ 2' సినిమా విషయంలో దర్శకుడు శంకర్ - లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 'ఇండియన్ 2' ప్రాజెక్ట్ ని పక్కనపెట్టి.. శంకర్ మరో రెండు చిత్రాలకు కమిట్ అవ్వడంపై లైకా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శంకర్‌ పై మద్రాస్‌ హైకోర్టులో కేసు కూడా వేశారు. ఇప్పటికే సినిమా కోసం రూ.236 కోట్లు ఖర్చు చేశామని.. శంకర్ ‏కు రెమ్యూనరేషన్ గా మాట్లాడుకున్న మొత్తంలో రూ.14 కోట్లు చెల్లించామని నిర్మాణ సంస్థ కోర్టుకు తెలిపింది. 'ఇండియన్ 2' సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకుండా శంకర్ ను ఆదేశించాలని కోరారు.

మరోవైపు శంకర్ కూడా 'ఇండియన్ 2' సినిమా లేట్ అవడానికి లైకా నిర్మాణ సంస్థ కారణమంటూ వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాలు కూర్చొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించింది. అయినప్పటికీ ఈ వివాదం ఓ కొలిక్కి రాకపోవడంతో కేసు కొనసాగుతోంది. దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మద్రాస్ హైకోర్టు శంకర్-లైకా వివాదంపై మాజీ సుప్రీం జడ్జి ఆర్.పనుమతిని మధ్యవర్తిగా నియమించారని తెలుస్తోంది. ఇరు పక్షాలతో మాట్లాడి ఆయన ఈ సమస్యకు పరిష్కారాన్ని చేపిస్తారేమో చూడాలి.

ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్ణయించనున్నారు. అలానే బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో ‘అపరిచితుడు’ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు వెల్లడించారు. పెన్ స్టూడియోస్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Tags:    

Similar News