మస్ కా దాస్ మరో సాహసం చేస్తున్నాడా?
రజత్ రవిశంకర్ కోలీవుడ్ డైరెక్టర్. దాదాపు ఏడేళ్ల క్రితం కార్తి, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా `దేవ్` మూవీని రూపొందించాడు.;
మస్ కా దాస్‌గా ఏరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ గత కొంత కాలంగా తన పట్టుని కోల్పోయి వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటున్నాడు. తాను డైరెక్ట్ చేసి నటించిన `దాస్ కా ధమ్కీ`తరువాత విశ్వక్ హిట్టు మాట విని దాదాపు మూడేళ్లవుతోంది. మధ్యలో `గామి` ఆకట్టుకున్నా తన మార్కు సినిమా కాకపోవడంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. వారి కోసం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ చేసినా ఫలితం లేకుండా పోయింది. లేడీ గెటప్ ధరించి ఫస్ట్ టైమ్ ప్రయోగం చేయాలని ప్రయత్నించినా నో యూజ్.
ఇవన్నీ పక్కన పెట్టి కామెడీ డ్రామాతో ఆకట్టుకోవాలని `జాతిరత్నాలు` డైరెక్టర్ అనుదీప్ కెవీతో కలిసి చేసిన `ఫంకీ` ఫస్ట్ రోజే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో విశ్వక్‌సేన్ తీసుకున్న తాజా నిర్ణయం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలని, సామాన్య ఆడియన్స్‌ని షాక్‌కు గురి చేస్తోంది. ప్రస్తుతం లెగసీ, కల్ట్ సినిమాల్లో నటిస్తున్న విశ్వక్‌సేన్ తన తదుపరి మూవీని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్‌లో చేయబోతున్నాడు. దీనికి రజత్ రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నాడు.
రజత్ రవిశంకర్ కోలీవుడ్ డైరెక్టర్. దాదాపు ఏడేళ్ల క్రితం కార్తి, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా `దేవ్` మూవీని రూపొందించాడు. ఇది కార్తి కేరీర్‌లోనే అత్యంత భారీ డిజాస్టర్ మూవీగా నిలిచి షాక్ ఇచ్చింది. దీంతో డైరెక్టర్‌గా రజత్ రవిశంకర్‌కు ఏడేళ్లు విరామం తీసుకోవాల్సి వచ్చింది. కార్తీ లాంటి ప్రామిసింగ్ హీరోకే భారీ డిజాస్టర్ ఇచ్చిన ఈ దర్శకుడితో ఇప్పుడు విశ్వక్‌సేన్ కలిసి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరిని షాక్‌కు గురి చేస్తోంది. అయితే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రజత్ రవిశంకర్ ఈ సారి పక్కా స్క్రిప్ట్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.
యువసుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ `దేవర` మూవీతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. త్వరలో `దేవర` సీక్వెల్‌ని కూడా పట్టాలెక్కించడానికి రెడీ అవుతోంది. మరి కొన్ని భారీ సినిమాలు చర్చలు దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశ్వక్‌సేన్, రజత్ రవిశంకర్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ సినిమాకు శ్రీకారం చుడుతోంది. ప్రతిష్టాత్మక చిత్రాల సంస్థగా పేరు తెచ్చుకున్న యువ సుధా ఆర్ట్స్ విశ్వక్‌సేన్ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ స్థాయిలో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీతో విశ్వక్‌తో పాటు తనకు తిరుగులేని సక్సెస్‌ని రజత్ రవిశంకర్ సొంతం చేసుకుంటాడా? అన్ని వేచి చూడాల్సిందే.