ప్రభాస్ 'స్పిరిట్' బజ్‌కి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం...!
ఇక స్పిరిట్ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా కూడ ఆ ఆకాశమే హద్దు అన్నట్లుగా హైప్ క్రియేట్ అవుతోంది.;
సలార్, కల్కి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమాలు అంటే సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటం కామన్. భారీ అంచనాలను మోస్తూ ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలను మొదలు పెట్టాడు. రాజాసాబ్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. దర్శకుడు మారుతి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు అంటూ విమర్శలు వచ్చాయి. రాజాసాబ్ సినిమా ఫెయిల్యూర్ కి ప్రభాస్ కారణం కాదని, మారుతి కారణం అంటూ రెబల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజాసాబ్ ఫలితంతో సంబంధం లేకుండా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ, స్పిరిట్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ హీరోగా ఫౌజీ సినిమా...
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాతో పోల్చితే సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న 'స్పిరిట్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. స్పిరిట్ సినిమా ప్రకటించి చాలా కాలం అయినా, షూటింగ్ మొదలై మాత్రం కొంత కాలం అయింది. వచ్చే ఏడాది స్పిరిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ మధ్య ప్రభాస్ లుక్ ను రివీల్ చేస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఒక ఫోటోను షేర్ చేశాడు. అందులో ప్రభాస్ పూర్తిగా గాయాలకు కట్లు కట్టుకుని ఉన్నాడు. హీరోయిన్ త్రిప్తి డిమ్రి ని సైతం ఫస్ట్ లుక్ లో రివీల్ చేయడం జరిగింది. యానిమల్ వంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ వంగ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలను అందుకుని ఏవిధంగా స్పిరిట్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఇప్పటికే వచ్చిన పోస్టర్ చెప్పకనే చెబుతోంది.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్..
ఇక స్పిరిట్ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా కూడ ఆ ఆకాశమే హద్దు అన్నట్లుగా హైప్ క్రియేట్ అవుతోంది. అదుగో ఇదిగో అన్నట్లుగా ఎప్పటికప్పుడు స్పిరిట్ సినిమా గురించిన చర్చ జరుగుతూనే ఉంది. స్పిరిట్ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో సినిమా గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త వార్తలు, ఫోటోలు వైరల్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏఐ క్రియేట్ ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. తాజాగా ప్రభాస్ స్పిరిట్ కొత్త లుక్ అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని చాలా మంది రియల్ స్పిరిట్ స్టిల్ అనుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు సైతం ఆ స్టిల్ విషయమై స్పందించలేదు. కానీ చాలా నేచురల్‌గా, అచ్చం స్పిరిట్ లో ప్రభాస్ మాదిరిగా ఆ ఫోటో ఉండటంతో అంతా కూడా అది నిజమే అన్నట్లుగా ఫీల్ అయ్యి వేలాది మంది షేర్ చేయడం జరిగింది.
ప్రభాస్ స్పిరిట్ మూవీ...
ప్రభాస్ కి ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరో ఇమేజ్ కారణంగా ఇప్పుడు స్పిరిట్ సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా దేశ వ్యాప్తంగా నిమిషాల్లో వైరల్ కావడం మనం చూస్తూ ఉన్నాం. ఇండియన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ సినిమా గురించిన వార్త నిమిషాల వ్యవధిలో చేరుతుంది. ఇలాంటి సమయంలో స్పిరిట్ సినిమా నుంచి స్టిల్ అనగానే ప్రేక్షకులు, ఫ్యాన్స్ దాన్ని తెగ షేర్ చేశారు. ఏఐ ఫోటో అని కొందరు గుర్తించినా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి మరింత మందికి చేరువ అయ్యేలా చేశారు. స్పిరిట్ సినిమాకు ఉన్న బజ్ ఏంటో ఈ ఏఐ ఫోటో కి వచ్చిన రెస్పాన్స్ ను చూస్తే అర్థం అవుతుంది. స్పిరిట్ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది అనేందుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. విడుదల ముందు వరకు స్పిరిట్ రేంజ్ మరింత పెరగడం ఖాయం. ప్రభాస్ గత చిత్రాల కంటే మించి స్పిరిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.