త‌రుణ్ భాస్కర్ కి ఈ నిర్మాత‌ స్టేట్మెంట్ కౌంట‌ర్ కాదు క‌దా?

Update: 2020-07-08 11:30 GMT
పెళ్లి చూపులు, ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాల‌తో ప్రేక్షాకాద‌ర‌ణ తెచ్చుకున్న డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ఈ మ‌ధ్య ఇచ్చిన స్టేట్మెంట్ ప్ర‌కారం, మ‌ళ‌యాల సినిమాలు బాగుంటాయి, తెలుగు సినిమాలు ఓ మాదిరిగా ఉంటాయి అన్నాడ‌ట‌. అయితే త‌రుణ్ భాస్కర్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పై ర‌కాల‌ర‌కాల క‌థ‌నాలు మీడియాలో వెలువ‌డ్డాయి. అయితే ఇప్పుడు అప్ క‌మింగ్ నిర్మాత ఎస్ కే ఎన్ త‌రుణ్ భాస్క‌ర్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కి కౌంట‌ర్ స్టేట్మెంట్ ఇచ్చిన‌ట్లుగా అనిపిస్తోంది.

తాజాగా ఎస్ కే ఎన్ ఫిల్మ్ మీడియాకి ఇచ్చిన ఓ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్ వ్యూలో తాను ఎక్క‌డో వార్త‌ల్లో మ‌ళ‌యాల సినిమాలు బాగుంటాయ‌ని, తెలుగు సినిమాలు ఓ మాదిరిగా ఉంటాయ‌నే స్టేట్మెంట్ చ‌దివా అని, అస‌లు తెలుగు సినిమాలు అలా త‌క్కువ చేసి చూడ‌టం స‌రికాద‌ని, తెలుగు సినిమా అంటే అమ్మ చేతి వంట లాంటిద‌ని, హోట‌ల్ లో ఎప్పుడో భోజ‌నం చేసినంత మాత్ర‌న‌, అమ్మ వంటకి వంక‌లు ఎలా అయితే పెట్ట‌మో, ఏదో ఒక మ‌ళ‌యాల సినిమా బాగున్నంత మాత్ర‌న‌, తెలుగు సినిమాల‌ను త‌క్కువ చేసి మాట్లాడ‌టం స‌రికాదంటూ చెప్పుకొచ్చాడు.

 ఈ నేప‌థ్యంలో త‌రుణ్ భాస్క‌ర్ ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకునే ఎస్ కే ఎన్ ఈ కంటౌర్ ఇచ్చాడ‌నే వార్త ఇప్పుడు ఫిల్మ్ స‌ర్కిల్స్ మ‌ధ్య షికార్లు చేస్తోంది. అయితే అటు త‌రుణ్ భాస్క‌ర్, ఇటు ఎస్ కే ఎన్ కి ఓ కామ‌న్ పాయింట్ కూడా ఉండ‌టం విశేషం. వీరిద్ద‌రు విజ‌య్ దేవ‌ర‌కొండ ద్వారానే లాంఛ్ అయ్యారు. పెళ్లి చూపులు సినిమాతో త‌రుణ్ భాస్క‌ర్ డైరెక్ట‌రైతే, టాక్సీవాలా సినిమాతో ఎస్ కే ఎన్ నిర్మాతైయ్యాడు.
Tags:    

Similar News