సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓపెన్ చేయబోతున్నారా...?
కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగులు.. థియేటర్స్.. మల్టిప్లెక్సెస్ బంద్ అయ్యాయి. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్స్ కి అనుమతి లభించినా కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆలోచిస్తున్నారు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సినిమా అనేది కొన్ని కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యాపారం. ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేని పరిస్థితులలో నిర్మాతలు తమ చిత్రాలని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎనిమిది క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్స్ రిలీజ్ ప్రకటించినప్పటికీ పరిస్థితుల వల్ల డైరెక్ట్ ఓటీటీలలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ సినిమాలు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఎగ్జిబిషన్ రంగం ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. ఇప్పటికే ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేట్రికల్ విడుదలను దాటవేసి డిజిటల్ స్ట్రీమింగ్ కి వెళ్తున్న చిత్ర నిర్మాతలపై ప్రెస్ నోట్ రిలీజ్ చేసి హెచ్చరికను జారీ చేసింది.
అయితే ఈ పరిస్థితిలో చిత్రనిర్మాతలను ఆపడానికి ఎగ్జిబిటర్ల దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం థియేటర్స్ ఓపెన్ చూపించడమే. దీనికోసం జూన్ చివరి నాటికి థియేటర్లను తిరిగి తెరవడానికి వీలుగా నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే లాబీయింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా మన టాలీవుడ్ లోని కొన్ని సింగిల్ స్క్రీన్ సిండికేట్లు కూడా థియేటర్స్ ఓపెన్ చేయడానికి అనుమతించమని తెలుగు రాష్ట్రాలను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాయని సమాచారం. థియేటర్స్ ఓపెన్ చేస్తే సామాజిక దూరం పాటించడంతో పాటు ఇతర భద్రతా చర్యలతో సినిమాలను ప్రదర్శిస్తామని వారు ప్రభుత్వాలకు హామీ ఇస్తున్నారట. మరి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. మూడో సారి విధించిన లాక్ డౌన్ ఈ నెల 17తో ముగియనుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగించింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్స్ ఓపెన్ చేయడానికి అనుమతి ఇస్తారో లేదో చూడాలి.