• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ చరణ్ తో మరో...

రామ్ చరణ్ తో మరో మల్టీస్టారర్.. నమ్మొచ్చా?

By - Tupaki Desk
Update: 2022-08-01 14:30 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలకు మొదట ప్రాణం పోసిన వారిలో శంకర్ షణ్ముగం కూడా ముఖ్య పాత్ర పోషించారు అని చెప్పాలి. ఆయన కెరీర్ మొదట్లో చేసిన సినిమాలు అన్నీ కూడా భాషతో సంబంధం లేకుండా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే రోబో సినిమా తరువాత మాత్రం శంకర్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేదు.

స్నేహితుడు మనోహరుడు ఆ తర్వాత వచ్చిన 2.0 సినిమా అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక ప్రస్తుతం అయితే అందరి ఫోకస్ రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా పైనే ఉంది.

ఈ సినిమా RRR సినిమా తర్వాత రామ్ చరణ్ కెరీర్ లోనే సోలో హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమా కాబట్టి తప్పకుండా సక్సెస్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సినిమా కొనసాగుతున్న సమయంలోనే దర్శకుడు శంకర మరో కీలకమైన ప్రాజెక్టును అనౌన్స్ చేయాలి అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే శంకర్ లిస్టులో ఫినిష్ చేయాల్సిన కమిట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయాల్సి ఉండగా ఆ తర్వాత హిందీలో అపరిచితుడు 2 రన్వీర్ సింగ్ తో చేయాల్సి ఉంది. ఇక ఈ కమిట్మెంట్స్ తో పాటు ముందుగానే రామ్ చరణ్ తో కలిసి మరొక ప్రాజెక్టుపై ఒక నిర్ణయానికి రావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అందులోనే హృతిక్ రోషన్ మరొక హీరోగా కనిపిస్తాడట. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించే ఆ సినిమా సైన్స్ ఫిక్షన్ తరహాలో ఎక్కువ భాగం అండర్ వాటర్ కాన్సెప్ట్ లో ఉంటుంది అని తమిళ మీడియాలో అయితే జోరుగా వార్తలు వస్తున్నాయి.

ఇక రాంచరణ్ తో అయితే శంకర్ మరొక ప్రాజెక్టు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు పక్కాగా సమాచారం అందుతొంది.. కానీ అది ఏ ప్రాజెక్టు ఎలాంటి ప్రాజెక్టు అనే విషయంలో మాత్రం ఇంతవరకు సరైన క్లారిటీ రాలేదు. మరి ఇక ఈ రూమర్స్ పై క్లారిటీ రావాలి అంటే అధికారికంగా ఒక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
Tags:    
  • TollywoodFilmIndustry 
  • PanIndiaFilms 
  • RRRMovie 
  • Ramcharan 
  • DirectorShankar 
  • Indian2Film 
  • HruthikRoshan 
  • RanveerSingh 
  • Aparichitudu2Film 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS