రామ్‌ కన్ఫ్యూజ్‌ లో ఉన్నాడా? క్లారిటీగా ఉన్నాడా?

Update: 2020-11-13 11:10 GMT
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ కెరీర్‌ ఆరంభంలో వరుసగా మంచి సినిమాలు చేసి తక్కువ సమయంలో చిన్న వయసులోనే స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆమద్య రామ్‌ వరుసగా నిరాశ పర్చుతూ వచ్చాడు. కెరీర్‌ డౌన్‌ ఫాల్‌ అవుతున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో కెరీర్‌ ఊపందుకుంది. ఆ సినిమా తర్వాత రామ్‌ ఇస్మార్ట్‌ గా ఆలోచించడం మొదలు పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే రామ్‌ కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత రెడ్‌ సినిమాను చేశాడు. అది కూడా రీమేక్‌. దాని తర్వాత ఇప్పటి వరకు అధికారికంగా రామ్‌ కొత్త సినిమాకు ఓకే చెప్పలేదు.

ఈ లాక్‌ డౌన్‌ టైమ్‌ లో పదుల కొద్ది కథలు విన్నాడట. ఎంతో మంది దర్శకులను ఈయన కథ సరిగా లేదంటూ రిజెక్ట్‌ చేశారట. ఈయన రిజెక్ట్‌ చేసిన కథలు ఒకటి రెండు వేరే హీరోల వద్దకు వెళ్లి అక్కడ షూటింగ్‌ కూడా జరుపుకుంటున్నాయట. కాని రామ్‌ మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కథలను వరుసగా రిజెక్ట్‌ చేస్తున్న రామ్‌ క్లారిటీగా ఉండే ఈ నిర్ణయం తీసుకున్నాడా లేదంటే మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో కన్ఫ్యూజ్‌ అయ్యి ఇలా కథలు రిజెక్ట్‌ చేస్తున్నాడా అంటూ మీడియా సర్కిల్స్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రామ్‌ అన్నికథలు రిజెక్ట్‌ చేసిన తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. రామ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా విషయమై బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తే రామ్‌ కెరీర్‌ లో మరో రెండు మూడు మెట్లు పైకి వెళ్లినట్లే అనిపిస్తుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రామ్‌ మూవీ అసలు విషయం ఏంటీ అనేది చూడాలి.
Tags:    

Similar News