• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళి ఇప్పటికి ఆ ట్వీట్...

రాజమౌళి ఇప్పటికి ఆ ట్వీట్ కు కట్టుబడి ఉన్నారా?

By - Tupaki Desk
Update: 2020-08-02 06:30 GMT
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మీద ఇప్పుడు హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఏపీ రాష్ట్ర గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో..సాంకేతిక అంశాలు మినహాయిస్తే.. ఏపీకి మూడు రాజధానుల రాష్ట్రంగా మారుతుందని చెప్పక తప్పదు. గవర్నర్ బిల్లును ఆమోదించిన తర్వాత జరిగే ప్రక్రియ మొత్తం సాంకేతికంగానే చూడాలి. ఎందుకంటే.. ఈ విషయంలో ఏదైనా తేడా ఉంటే.. మొదటే గవర్నర్ ఆమోదముద్ర వేసి పంపటం అన్నది ఉండదన్నది మర్చిపోకూడదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మూడు రాజధానుల అంశంపై గతంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేసిన పోస్టు ఒకటి చర్చకు వస్తోంది. కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఆ సమయానికి ఏపీలో మూడు రాజధానుల వ్యవహారమే చర్చకు లేదు. అసలు రాజధాని ఎక్కడ పెట్టాలన్న విషయం మీద చర్చ మాత్రమే నడుస్తుంది తప్పించి.. ఒక రాజధాని ఏర్పాటు చేయాలా? రెండు రాజధానులు ఏర్పాటు చేయాలన్న దానిపై ఎవరూ ఆలోచించని పరిస్థితి.

ఎన్నికలకు కాస్త ముందుగా (2014, మార్చి 11)ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అందులో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ సందేశాన్ని షేర్ చేశారు. ఆ పోస్టు పెట్టటం ద్వారా జేపీ ఆలోచనలకు తన మద్దతు ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైంది.  ఆ పోస్టులో రాయలసీమలో ఉన్న ఖనిజాలకీ.. కోస్తాలో ఉన్న తీర ప్రాంతానికి బాగా డెవలప్ కావొచ్చొని.. న లోక్ సత్తాకు కానీ అధికారం ఇస్తే.. ఐదేళ్లలో ఏపీని దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలుపుతామన్న సందేశం ఆ పోస్టులో ఉంది.

ఏపీకి రాజధాని ఎన్ని ఉండాలన్న ఆలోచన ఎవరికి లేని వేళలోనే.. మూడు.. నాలుగు ఉండాలన్న జేపీ ఆలోచనకు జై కొట్టిన రాజమౌళి ఇప్పుడెలా రియాక్టు అవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. ఎన్నికల్లో లోక్ సత్తాకు ఒక్కసీటు రాకపోవటం.. అధికారం టీడీపీ-బీజేపీకి హస్తగతం కావటం తెలిసిందే. తర్వాతి కాలంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించి.. కొన్ని భవనాల్ని నిర్మించటం తెలిసిందే.

ఈ ప్రక్రియలో అమరావతిని ఎలా డిజైన్ చేయాలన్న దానిపైనా రాజమౌళిని ప్రత్యేకంగా చంద్రబాబు పిలిపించుకొని చర్చలు జరపటాన్ని మర్చిపోకూడదు. సినీ దర్శకుడ్ని రాజధాని నగరం ఎలా డిజైన్ చేయాలన్న విషయం మీద పిలిపించుకొని మాట్లాడటం.. అధికారులతో కలిసి కూర్చోబెట్టటంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమరావతి విషయంలో కీలకంగా వ్యవహరించిన రాజమౌళి.. తన పాత స్టాండ్ కు కట్టుబడి ఉన్నారా? అన్న దానిపై కాస్తంత క్లారిటీ ఇస్తే మరింత బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    
  • Rajamouli 
  • RRR 
  • Ram Charan 
  • Ntr 
  • Alluri Seetharamaraju 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS