పీసీ పేరును అలా మార్చుకుంటుందా?

Update: 2018-11-26 07:33 GMT
పెళ్ళి చేసుకున్న తర్వాత అమ్మాయి ఇంటిపేరు మారడం అన్నది దాదాపు అన్ని కల్చర్ లలో ఉన్నదే.  ఈమధ్య అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు అన్ని రంగాలలో రాణిస్తుండడంతో కొంతమంది మాత్రం పెళ్ళైన తర్వాత కూడా తమ ఒరిజినల్ పేరునే కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఫిమేల్ సెలబ్రిటీల విషయానికి వస్తే వారు పెళ్ళి తర్వాత ఇంటిపేరు మార్చుకుంటారా లేదా అని మీడియాలో చర్చలు సాగుతుంటాయి. ఇప్పుడు గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా విషయంలో అలాంటి చర్చలు జరుగుతున్నాయి.

ప్రియాంక డిసెంబర్ 2 న జోధ్ పూర్లో తన అమెరికన్ బాయ్ ఫ్రెండ్ నిక్ జోనాస్ ను పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.  ప్రియాంక ప్రస్తుతం ఢిల్లీలో 'ది స్కై ఈజ్ పింక్' సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది.  త్వరలో ప్రియాంక పెళ్ళి చేసుకోనుండడంతో ఫిలిం యూనిట్ వారు ఒక సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చారు.  సెలెబ్రిటీ పార్టీ అంటేనే షాంపేన్ బాటిల్.. కేక్ ఉంటుంది కదా. అలానే పార్టీని జరిపారు.  ఆ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి.  ఇక ఆ ఫోటోలలో అందరినీ ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే చాకొలేట్ కేక్ మీద 'కంగ్రాచ్యులేషన్స్ టూ అవర్ టు బీ బ్రైడ్ పీ. సీ. జె' అని రాసి ఉండడం.  పీ. సీ. జె అంటే ప్రియాంక చోప్రా జోనాస్ అని ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదు కదా?

దీంతో ప్రియాంక తన పేరును పెళ్ళి తర్వాత ప్రియాంక చోప్రా జోనాస్ అని మార్చుకుంటుందని కన్ఫాం అయినట్టేనని నెటిజనులు తీర్మానిస్తున్నారు. మరి ఈ విషయం మరో వారం లోపు తేలే అవకాశం ఉంది.  ఇదిలా ఉంటే.. ఈ గ్లోబల్ జంట హిందూ.. క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు పెళ్ళిచేసుకోబతున్నారు.  నవంబర్ 29 న మెహెందీ.. సంగీత్ ఫంక్షన్లు జరుగుతాయని సమాచారం.  

 

Similar News