జక్కన్న అనుకున్నట్లే ప్రశాంత్ నీల్‌ కూడా..!

Update: 2020-12-24 06:30 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా రెండు పార్ట్‌ లు కూడా సెన్షేషనల్‌ సక్సెస్‌ అయ్యాయి. ఆ సినిమాలు సక్సెస్‌ అయిన తీరు చూస్తే మరో రెండు పార్ట్‌ లు తీసినా కూడా జనాలు విరగబడి చూసే అవకాశం ఉంది. ఆ కారణంగానే బాహుబలి 3 ని రాజమౌళి చేస్తే బాగుంటుందని చాలా మంది భావించారు. కాని జక్కన్న మాత్రం అందుకు ఒప్పుకో లేదు. తాను అనుకున్న కథ బాహుబలి 2 తో పూర్తి అయ్యింది. బాహుబలి 3 ని చేయాలంటే కథను సాగతీయాలి.. కొత్తగా ఏదో సృష్టించాలి అలాంటిది నాకు ఇష్టం లేదు. బాహుబలి రెండు పార్ట్‌ లతోనే పూర్తి అంటూ ప్రకటించాడు. ఇప్పుడు అచ్చు గుద్దినట్లుగా అలాంటి ప్రకటననే కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చేశాడు.

రెండేళ్ల క్రితం వచ్చిన కేజీఎఫ్‌ 1 మూవీకి సీక్వెల్‌ గా కేజీఎఫ్‌ 2 వస్తున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్‌ పై ఉన్న అంచనాల నేపథ్యంలో మరో రెండు పార్ట్‌ లు చేసినా కూడా రికార్డు బద్దలయ్యే వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. కాని దర్శకుడు ప్రశాంత్ నీల్‌ మాత్రం కేజీఎఫ్‌ కథను ఛాప్టర్ 2 తో ముగించబోతున్నట్లుగా ప్రకటించాడు. కన్నడ మీడియాలో వస్తున్నట్లుగా కేజీఎఫ్‌ 3 లేనే లేదు అంటూ ప్రకటించాడు. కేజీఎఫ్‌ 2 తర్వాత మళ్లీ కేజీఎఫ్‌ ప్రస్థావన కూడా ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చేశాడు. వరుసగా ఇతర సినిమాలతో ఆయన బిజీ అవ్వబోతున్నాడు. ఇప్పటికే సలార్ సినిమాను ప్రభాస్ తో ప్రకటించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ తో చరణ్‌ తో కూడా సినిమాలు చేయాల్సి ఉంది. కనుక కేజీఎఫ్‌ 3 ఎట్టి పరిస్థితుల్లో ఉండదని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.
Tags:    

Similar News