బిగ్ ట్విస్ట్.. విలన్ గా న్యాచురల్ స్టార్!

Update: 2019-02-19 10:45 GMT
న్యాచురల్ స్టార్ నాని వరస విజయాలతో కొన్నేళ్ళు బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే. మధ్యలో 'కృష్ణార్జున యుద్ధం'.. 'దేవదాస్' సినిమాలు డిజప్పాయింట్ చేయడంతో రొటీన్ సినిమాల రూట్ మార్చి విభిన్న కథాంశాలు ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు సెట్ పైనున్న జెర్సీ.. సెట్స్ మీదకు వెళ్లనున్న #నాని24 అలాంటివే.

'జెర్సీ' లో నేషనల్  క్రికెట్ టీమ్ లో స్థానం సంపాదించేందుకు తపనపడే మధ్య వయస్కుడి పాత్రలో నటిస్తున్నాడు.  ఇక #నాని24 లో ఒక రోమియో పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విభిన్న కథాంశాలకు పచ్చజెండా ఊపడం ఇంతటితో ఆగలేదు.  తన నెక్స్ట్ సినిమాను మరో లెవెల్ కు తీసుళ్తున్నాడని సమాచారం.  ఈ రెండు సినిమాల తర్వాత నాని తన 25 వ చిత్రాన్ని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు.  ఈ సినిమా గురించి ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తాడని టాక్ విన్పిస్తోంది. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడట. మరి నాని పాత్ర విలన్ లాగా ఉంటుందా లేదా 'బాజీగర్' సినిమాలో షారూఖ్ స్టైల్ లో యాంటి హీరోలా ఉంటుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా తెలుగులో ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఇలా నెగెటివ్  రోల్ చేయడం సెన్సేషనే.  ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనుంది.
    

Tags:    

Similar News