మెగా హీరో ఫ్యూచర్ దిల్ రాజు చేతిలో ఉందా...?

Update: 2020-08-14 02:30 GMT
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ మరియు 'నో పెళ్లి' వీడియో సాంగ్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.

కాగా కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుండటంతో థియేటర్స్ ఇప్పట్లో రీ ఓపెన్ చేసేలా కనిపించడం లేదు. దీంతో 'సోలో బ్రతుకు సో బెటర్' సినిమా ఇప్పుడప్పుడే రిలీజ్ అయ్యే సిచ్యుయేషన్ లేదు. అందులోనూ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దగ్గర ఉన్నాయని సమాచారం. అయితే ముందుగా ఈ చిత్రాన్ని దిల్ రాజు ఈ డిసెంబర్ లో కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేసుకున్నాడట. కాకపోతే ఇప్పుడు ఆ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దిల్ రాజు ప్రొడక్షన్ లో నాని - సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన 'వి' చిత్రాన్ని ఆన్లైన్ లో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా హీరో 'సోలో బ్రతుకు సో బెటర్' సినిమాని కూడా అదే విధంగా రిలీజ్ చేస్తారు అనే న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. 'ప్రతిరోజూ పండగే' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సాయి ధరమ్ తేజ్ మూవీని థియేటర్స్ లోనే విడుదల చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ పై రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News