పవర్ స్టార్ ప్రాజెక్ట్ కంటే ముందు మరో మూవీ చేయనున్నాడా..?

Update: 2020-11-17 12:30 GMT
టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్ జాగర్లమూడి. 'గమ్యం' సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన క్రిష్.. ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమాలతో పాటు భావోద్వేగానికి గురి చేసే సినిమాలు అందిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో  ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. పీరియాడికల్ మూవీగా రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో తీయడానికి సన్నాహకాలు చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసిన పవన్ సినిమా కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే ఈ గ్యాప్ లో కేవలం 45 రోజుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో ఓ సినిమా పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు క్రిష్. దీంతో త్వరలోనే పవన్ సినిమాని మళ్ళీ స్టార్ట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కంటే ముందు మరో సినిమా చేయడానికి క్రిష్ ప్లాన్స్ చేసుకుంటున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

కోవిడ్ నేపథ్యంలో అన్ని షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతుండటంతో పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాల షూటింగ్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా 'వకీల్ సాబ్' చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అదే సమయంలో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'వకీల్ సాబ్' తర్వాత ఈ చిత్రాన్ని చేయాలని అనుకుంటున్నాడట. దీంతో పవన్ ఫ్రీ అయ్యేలోపు క్రిష్ మరో సినిమా చేయనున్నాడట. ప్రముఖ నవల ఆధారంగా ఓ మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్న క్రిష్.. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడట. ఈ చిత్రాన్ని తన హోమ్ బ్యానర్ లోనే రూపొందించే అవకాశాలు ఉన్నాయని.. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
Tags:    

Similar News