ఓవర్ సీస్ మార్కెట్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా..?
కోవిడ్-19 ప్రభావం సినీ ఇండస్ట్రీపై ఇప్పట్లో కోలుకోలేని విధంగా పడింది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ స్టార్ట్ అవడం.. అక్కడక్కడా మల్టీప్లెక్సులు రీ ఓపెన్ అవడంతో త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నాయి. ప్రస్తుతానికి థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరవనప్పటికీ నెలాఖరుకు దీనిపై ఓ క్లారిటీ అయితే వస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే థియేటర్స్ రీ ఓపెన్ చేసి ఆడియెన్స్ ఎప్పటిలా రావడం మొదలుపెట్టి సినీ ఇండస్ట్రీ అంతా మామూలు పరిస్థితికి వచ్చినా ఇప్పట్లో ఓవర్ సీస్ పంపిణీ సంస్థలు కోలుకోవటం కష్టమే అనే టాక్ నడుస్తోంది.
వాస్తవానికి మన సినిమాలు ఎక్కువగా ఓవర్ సీస్ బిజినెస్ పైనే ఆధారపడుతుంటాయి. ఇక్కడ నిర్మించబడే ప్రతి సినిమా అక్కడ విడుదలై భారీ వసూళ్లను రాబడుతుంటాయి. కొన్ని సినిమాలు రెవిన్యూ పరంగా ఇక్కడ ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ.. ఓవర్ సీస్ కలెక్షన్స్ వల్ల అంతో ఇంతో బయటపడుతుంటాయి. అందుకే మన హీరోలు సైతం అక్కడకు వెళ్లి ప్రమోషన్స్ చేస్తుంటారు. అయితే కరోనా కారణంగా ఓవర్ సీస్ మార్కెట్ కుదేలైంది. త్వరలో మామూలు పరిస్థితులు వస్తాయని భావిస్తున్నప్పటికీ ఓవర్ సీస్ మూవీ మార్కెట్ పై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది.
ఇప్పటి వరకు కేవలం ఓవర్ సీస్ సినిమా పంపిణీలోనే అడ్వాన్స్ లేకుండా ఫుల్ పేమెంట్ తో సినిమా బిజినెస్ జరుగుతుంది. అయితే కరోనా కారణంగా ఓవర్ సీస్ సినీ పంపిణీదారులు ఇప్పుడు అదే పద్ధతిని ఫాలో అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కాకపోతే నిర్మాతల వైపు నుంచి కాస్త లిబర్టీ వస్తే మాత్రం ఓవర్ సీస్ సినీ పంపిణి వ్యవస్థ కోలుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి రానున్న రోజుల్లో ఓవర్ సీస్ మార్కెట్ ఎప్పటిలాగే పుంజుకుంటుందేమో చూడాలి.