ఆ స్టార్ హీరోయిన్ బాడీగార్డ్ జీతం తెలిస్తే షాకే

Update: 2020-06-10 10:30 GMT
దీపికా పదుకొనే.. బాలీవుడ్ అగ్రహీరోయిన్లలో ఒకరు.  దేశంలో అత్యధిక అభిమానులను కలిగి ఉన్న టాప్ నటి ఈమె. దీపికా పదుకొనే ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. స్టార్ హీరోయిన్ కావడంతో ఆమె కాలు బయటపెడితే చాలు అభిమానులు చుట్టుముడుతారు.. ఉక్కిరిబిక్కిరి చేస్తారు.  అందుకే ఆమె సురక్షితంగా ఉండటానికి రక్షణ కోసం భారీ భద్రత అవసరం.

దీపికా సంపాదన ఏడాదికి వంద కోట్లపైమాటే.. సినిమాలు, బ్రాండ్ ఎండార్ఫ్ మెంట్ల ద్వారా ఆమెకు భారీగా ఆదాయం వస్తుంది. మరి ఇంత భారీ ఫాలోయింగ్ ఉన్న దీపిక తన బాడీగార్డ్ కు ఎంత జీతం ఇస్తుందో తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే..

విమానాశ్రయాలలో లేదా మరే ఇతర కార్యక్రమాలలో మీరు దీపికను చూసినప్పుడల్లా ఆమె తన బాడీగార్డ్‌తో ఎప్పుడూ కనిపిస్తుంటుంది. దీపిక వెనుకలా రక్షణగా అతడు అడ్డంగా నిలబడుతాడు. అతడి పేరు జమాల్. తాజాగా ఆమె బాడీగార్డ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

అదేంటంటే.. స్టార్ హీరోయిన్ అయిన దీపిక తన బాడీ గార్డ్ అయిన జమాల్‌కు నెలకు 6,50,000 చెల్లిస్తుంటుందట..బాడీగార్డ్‌గా మాత్రమే కాకుండా, దీపిక అతన్ని తన సోదరుడిలా చూసుకుంటుందని తెలిసింది. ప్రతి సంవత్సరం రాఖీని కూడా అతడికి కడుతుందట.. మన ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు దీపిక బాడీగార్డ్. ఎంతైనా అందరికీ ఆ అదృష్టం రాదు లేండీ..
Tags:    

Similar News