• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్యది కూడా పాన్...

బాలయ్యది కూడా పాన్ ఇండియా రూటేనా ...?

By - Tupaki Desk
Update: 2022-01-07 02:30 GMT
బాలయ్యది రెండేళ్ళు తక్కువ అయిదు దశాబ్దాల సుదీర్ఘమైన సినీ కెరీర్. వందకు పైగా సినిమాలు. అందులో బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు, రికార్డులను తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. బాలక్రిష్ణ ఫక్తు తెలుగు హీరో. ఆయన చేయాలనుకుంటే అప్పట్లోనే హిందీ సినిమాలు చేసేవారు. కానీ ఆయన నో బాలీవుడ్ ఓన్లీ టాలీవుడ్ అనేసుకున్నారు. ఆయన తరం హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఆయన మాత్రం ఆ వైపు చూడలేదు. అలాంటి బాలయ్య ఇపుడు పాన్ ఇండియా అంటున్నారు.

ఆయన లేటెస్ట్ హిట్ అఖండ తో నిర్మాతల దర్శకుల ఆలోచనలు ఒక్కసారిగా మారిపోయాయి. అఖండ డబ్ చేయకుండానే మిగిలిన సౌతిండియా ఏరియాల్లో రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిందట. స్టామినా ఉన్న మాస్ హీరో బాలయ్యతో పాన్ ఇండియా లెవెల్ మూవీ చేస్తే కలెక్షన్లు కుమ్మేయడం ఖాయమన్న ధీమా వారిలో కలిగింది. ఇక మైత్రీ మూవీస్ పతాకం మీద బాలయ్య గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా పాన్ ఇండియా రేంజిలో ఉండేలా డిజైన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

ఈ మూవీలో అందుకే ఏరి కోరి సౌతిండియా నటులను తీసుకున్నారని చెబుతున్నారు. బాలయ్యకు సరిసాటి విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ ని తీసుకున్నారు. ఆయనకు అక్కడ ఫాలోయింగ్ చాలా ఉంది. దాంతో కర్నాటకలో కూడా ఈ మూవీని డబ్ చేయడానికి ముందే ప్లాన్ అంటున్నారు. అదే విధంగా కోలీవుడ్ కి చెందిన ఇద్దరు భామలు ఈ సినిమాలో మెరవనున్నారు.

బాలయ్య పక్కన విశ్వనటుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే లేడీ విలన్ గా బాలయ్యను ఢీ కొట్టే పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా కోలీవుడ్ మార్కెట్ పెంచడానికే అంటున్నారు. ఈ మూవీ కధ కూడా కర్నాటక బోర్డర్ లో సాగుతుంది అని చెబుతున్నారు.

ఇక బాలయ్య చాలా కాలం తరువాత తండ్రీ కొడుకులుగా నటిస్తున్న మూవీ ఇదే. తండ్రి బాలయ్య పక్కన విజయశాంతి అని అనుకుంటున్నారు. ఆమె నో అంటే ఉత్తరాదికి చెందిన సీనియర్ హీరోయిన్ ని తేవాలనుకుంటున్నారుట. అలా పాన్ ఇండియాకు సరిపోయే విధంగా నటీనటులను ఎంపిక చేసి పెట్టుకున్నారు. పక్కా మాస్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ని టచ్ చేస్తూ ఈ మూవీ కంటెంట్ ఉంటుంది అంటున్నారు.

బాలయ్య ఇమేజ్ ని వేరే లెవెల్ లో ప్రెజెంట్ చేయడానికి గోపీ చంద్ మలినేని సిద్ధంగా ఉన్నారు. ఈ మూవీ దసరాకు రిలీజ్ అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయళం, నార్త్ ఇండియా లో మూవీ రిలీజ్ చేయడానికి మేకర్స్ చూస్తున్నారు. అన్ని చోట్లా డబ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మొత్తానికి బాలయ్య పాన్ ఇండియా హీరోగా గోపీచంద్ మలినేని మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నాడన్న మాట.




Tags:    
  • Varalaxmi Sarathkumar 
  • NBK 107 
  • Balakrishna 
  • Shruti Haasan 
  • Gopichand Malineni 
  • Duniya Vijay 
  • Thaman S 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS