ఎన్టీఆర్ సినిమాను అమ్మడు వదులుకుంటోందా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ప్రధాన తారాగణం - సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. RRR సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అలియా.. తారక్ తో కలిసి నటించనున్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ కాంబో సెట్ కాకపోవచ్చని.. అలియా #NTR30 ప్రాజెక్ట్ ను వదులుకోబోతోందని టాక్ నడుస్తోంది.
అలియా భట్ ఇతర కమిట్‌మెంట్స్ వల్లనో లేదా వివాహం తర్వాత కొన్ని నెలలు తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలనుకుంటుందా అనేది తెలియదు కానీ.. తారక్ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయాన్ని ఆమె ఇప్పటికే మేకర్స్ కు తెలియజేసినట్లు చెప్పుకుంటున్నారు.
ఒకవేళ అలియాతోనే సినిమా చేయాలని ఎన్టీఆర్ - కొరటాల అనుకుంటే మాత్రం ఇంకొన్నాళ్ళు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పటికే దర్శక హీరోలిద్దరూ ఒక్కో సినిమా కోసం చాలా సమయం కేటాయించారు. ఇద్దరూ ఇప్పుడు తమ కొత్త చిత్రాన్ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు.
కానీ ఇప్పుడు అలియా డేట్స్ కోసం వేచి చూస్తే ఇంకొన్ని నెలల సమయం ఖర్చయ్యే అవకాశం ఉంది. అందుకే మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. అందులోనూ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రెమ్యునరేషన్ ఎక్కువైనా ఎన్టీఆర్ సరసన అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు అమ్మడు తప్పుకోనుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇకపోతే 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత తారక్ - కొరటాల కాంబోలో రానున్న NTR30 మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. RRR తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. తదుపరి సినిమాతో సత్తా చాటితే పాన్ ఇండియా క్రేజ్ నిలబడుతుందని భావిస్తున్నారు.
ఇదొక రివేంజ్ డ్రామా అని ఎన్టీఆర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ కోరుకునే హీరోయిజంతో పాటుగా RRR తర్వాత ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని తెలిపారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.