అక్కినేని ఫ్యామిలీ సామ్ ని టార్చ‌ర్ చేస్తోందా?

Update: 2020-02-07 05:19 GMT
స‌మంత కెరీర్ గ‌తంలో పోలిస్తే ఇప్పుడే టాప్ గేర్ లో సాగుతోంది. విభిన్న‌మైన చిత్రాల్లో కొత్త త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌రుస విజ‌యాల్ని సాధిస్తోంది. ఆమె న‌టించిన చిత్రాలు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ని సాధిస్తున్నాయి కూడా. దీంతో ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో సినిమాలు చేయాల‌ని ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ఎగ‌బ‌డుతున్నారు.

ఇదిలా వుంటే తాజాగా స‌మంత ఇచ్చిన స్టేట్ మెంట్ అమె ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. `జాను` ప్ర‌మోష‌న్ లో భాగంగా స‌మంత చేసిన వ్యాఖ్య‌లు హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ని నిరాశ‌ కు గురి చేస్తున్నాయి. మ‌రో రెండు మూడేళ్లు మాత్ర‌మే న‌టిస్తాన‌ని, ఆ త‌రువాత ఎలా వుంటుందో తెలియ‌ద‌ని సామ్ ఇటీవ‌ల స్టేట్ మెంట్ ఇచ్చేసింది. నేను పెళ్లయిన అమ్మాయిని.. నా కుటుంబం గురించి కూడా చూసుకోవాలి క‌దా. హీరోయిన్‌ల కెరీర్ చాలా చిన్న‌ది అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అందుకే నా కెరీర్ ఇంకా రెండు మూడేళ్ల క‌న్నా ఎక్కువ సాగ‌దు అని చెబుతున్నాను` అని షాకిచ్చింది.

నేను అమ్మ‌ని కావాల‌ని.. ఓ పాప‌కి త‌ల్లిని కావాల‌ని కోరుకుంటున్నాను. అందుకే యాక్టింగ్ తో పాటు అన్నింటికి బ్రేక్ ఇవ్వాల‌నుకుంటున్నాను. యాక్టింగ్ కి బ్రేకిచ్చాక నా పాపే నా ప్ర‌పంచం. అని ఓపెన్ గా చెప్పేసింది. ఉన్న‌ట్టుండి సామ్ పెళ్లి- పిల్ల‌లు- ఫ్యామిలీ అని కొత్త ప‌ల్ల‌వి ఎత్తుకోవ‌డానికి అక్కినేని ష్యామిలీ పిల్ల‌ల కోసం చేస్తున్న ఫోర్సేన‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక పెళ్ల‌య్యి నాలుగైదేళ్లు అయితే ఇక ఇంట్లో వాళ్లు ఎలానూ ఊరుకోరు. పిల్ల‌లు లేక‌పోతే ఒత్తిడి అంతే ఇదిగా ఉంటుంది. ప్ర‌స్తుతం సామ్ ప‌రిస్థితి అలానే ఉంద‌ట‌. అందుకే ఇలాంటి క‌ఠోర నిర్ణ‌యం తీసుకుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. సినిమాల బిజీ ప్ర‌పంచంలో ప‌డిపోతే ఇక వ్య‌క్తిగ‌త జీవితం జీరో అయిపోతోంద‌న్న బెంగా అక్కినేని కోడ‌లుని వెంటాడుతోంద‌ట‌.
Tags:    

Similar News