ఇరగ ఇరగ అంటూనే ఇరగదీసిన బన్నీ

Update: 2018-04-24 17:08 GMT
నియంత్రించుకోలేనంత ఆవేశం కలిగిన సైనికుడి పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా. మరో 10 రోజుల్లోనే ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పుడీ సూర్యకు ప్రమోషన్స్ లో వేగం పెంచారు. రీసెంట్ గా మిలిట్రీ మాధవరంలో ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన నా పేరు సూర్య టీం.. ఇప్పుడు చిత్రంలోంచి 'ఇరగ ఇరగ' అంటూ సాగే పాటకు ప్రోమోను రిలీజ్ చేశారు.

ఇప్పటివరకూ వచ్చిన పాటలు మెలోడీలు.. దేశభక్తి థీమ్ తో ఉండగా.. ఇరగ సాంగ్ మాత్రం పక్కా కమర్షియల్ నెంబర్. హీరోయిన్ అను ఇమాన్యుయేల్ తో కలిసి.. బన్నీ స్టెప్పులు ఇరగదీసేసినట్లుగా కనిపిస్తోంది. ఈ పాటను పూర్తిగా సెట్స్ లోనే చిత్రీకరించగా.. సాంగ్ కోసం ఎంచుకున్న కలర్ థీమ్స్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. సిగ్నేచర్ స్టెప్ ను.. రెండు రకాల బ్యాక్ గ్రౌండ్స్ లో మార్చి మార్చి చూపిస్తూ.. ప్రోమో కట్ చేసిన విధానం అయితే మరీ సూపర్బ్ గా ఉంది.

ఇరగ ఇరగ పాటకు హీరోయిన్ అను ఇమాన్యుయేల్ అందాలు అడిషనల్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. విశాల్- శేఖర్ నుంచి వచ్చిన మాస్ నెంబర్ డిఫరెంట్ గా ఉండడమే కాదు ఆకట్టుకుంటోంది. తన మూడేళ్లన్నరేళ్ల కలను నిజం చేసిన అల్లు అర్జున్ కోసం.. దర్శకుడు వక్కంతం వంశీ.. నా పేరు సూర్యలో తన ట్యాలెంట్ అంతటినీ చూపించేసినట్లుగానే కనిపిస్తోంది.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News