కృష్ణ లంక ఇంట్రో: వ‌ర్మ‌లాగే రౌడీయిజం హ‌త్య‌లు రేసిజం..!

Update: 2021-06-01 14:30 GMT
ఒక‌రిని వెంబ‌డించ‌డం కొట్ట‌డం త‌న్న‌డం హత్య చేయ‌డం.. దాని వెన‌క కార‌ణ‌మేంటో చూపించ‌డం.. దాని వెన‌క ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ‌క‌థ‌ ఉండొచ్చని ఊహించేయ‌డం.. ఇవ‌న్నీ తెలుగు సినిమా క‌థ‌లు ఇంత‌కుముందే వ‌చ్చిన‌వే.  రౌడీయిజం హ‌త్య‌లు రేప్ లు రేసిజం ప‌గ ప్ర‌తీకారం..! ఇవ‌న్నీ తెర‌పై ఇప్ప‌టికే తెలుగు ఆడియెన్ చూశారు.

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఆర్జీవీ చాలా చూపించారు. కానీ ప్ర‌తిసారీ అవే క‌థ‌లు రిపీటెడ్ గా వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా కృష్ణ‌లంక ఇంట్రో వీడియో చూడ‌గానే ఒకసారి వ‌ర్మ మార్క్ లో నేచుర‌ల్ పంథా విజువ‌లైజేష‌న్ ఆక‌ర్షించింది. నేచుర‌ల్ లైవ్ లొకేష‌న్ నేచుర‌ల్ పెర్ఫామెన్సెస్ తో ఆక‌ట్టుకుంది. కొంద‌రు స్నేహితుల బృందం అందులో అమ్మాయితో హీరో ల‌వ్ వ‌గైరా ఆక‌ర్ష‌ణీయ‌మైన ఎలిమెంట్స్ ఈ వీడియోలో ఉన్నాయి.

`రంగు`(త‌నీష్‌) ఫేం కార్తికేయ ద‌ర్శ‌క‌త్వంలో పరుచూరు రవి- నరేష్ మేడి- ఆదర్స్-పెద్దిరాజు- ప్రతీక్ష-అనిత భట్ నటీనటులుగా సోహ్లా ప్రొడక్షన్స్ - చేతన్ రాజ్ ఫిలిమ్స్ లు కలసి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది.  నిర్మాత పూనా సోహ్లా పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇంట్రో ఆఫ్ కృష్ణ‌లంక వీడియోని విడుద‌ల చేసారు.

ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఇది ఎమోష‌న‌ల్ క్రైమ్ డ్రామా… ప్రేమ‌.. స్నేహాం .. ప‌గ వంటి భావోద్వేగాల‌తో న‌డిచే ఈక‌థ‌లో ప్ర‌తి పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. చాలా రియ‌లిస్టిక్ గా క‌థ‌నం ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. ప‌రుచూరి ర‌వి పాత్ర లో ఉండే మాస్ అప్పీల్ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌న్నారు. కృష్ణ సౌర‌భ్ సూరం ప‌ల్లి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Full View
Tags:    

Similar News