`సలార్` అప్డేట్.. ప్రభాస్ రంగంలోకి దిగేది అప్పుడేనట!?
ఇటీవల `రాధేశ్యామ్`తో ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచిన నేషనల్ స్టార్ ప్రభాస్.. ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ సిరీస్ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ కిరాగందుర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇందులో ప్రభాస్ కు జోడీగా ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ అలరించబోతోంది. అలాగే సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. దాదాపు నలబై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన పార్ట్ ను కూడా త్వరత్వరగా ఫినిష్ చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. గత కొద్ది రోజుల నుంచీ `కేజీఎఫ్ 2`తో బిజీగా ఉన్న ఈయన.. ఇప్పుడు ఫ్రీ అయ్యారు.
మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత వెకేషన్ కు వెళ్లి తిరిగొచ్చాడు. ఈ నేపథ్యంలోనే సలార్ ను రీస్టార్ట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. కొత్త షెడ్యూల్ ను మే మొదటి వారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నారట. అందుకు ప్రభాస్ సైతం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని.. మే ఫస్ట్ వీక్ లోనే శ్రుతి హాసన్ తో కలిసి ఆయన రంగంలోకి దిగబోతున్నాడని అంటున్నారు.
ఇక ఈ షెడ్యూల్ కంటిన్యూగా జరిపి టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, సరికొత్త కథతో ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ ను ఈ చిత్రంలో ప్రశాంత్ మరింత మాస్ గా చూపించబోతున్నాడు. పైగా కేజీఎఫ్ 2 విడుదల తర్వాత.. `సలార్`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు సలార్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు.