మెగాస్టార్ రీమేక్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్..??

Update: 2021-05-29 05:30 GMT
తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ మూవీస్ రూట్ వేరనే సంగతి తెలిసిందే. అందుకే మెగాస్టార్ సినిమాలకు ఉండే క్రేజ్ కూడా అదే రేంజిలో ఉంటుంది. ప్రస్తుతం  మెగాస్టార్ చిరంజీవి - టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇదివరకే మెగా అభిమానులకు ఆచార్య టీజర్ రిలీజ్ చేసి ట్రీట్ ఇచ్చారు. అదేవిధంగా ఆచార్య మూవీని మే 13న విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించేసారు. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో సినిమా షూటింగ్ నిలిచిపోయి వాయిదా పడింది. ఎప్పుడు లాక్డౌన్ ముగిసి షూటింగ్ ప్రారంభం అవుతుందో అంటూ మెగాఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

కానీ మెగాస్టార్ నటించబోయే తదుపరి సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. మెగాస్టార్ ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ సినిమాలో నటించనున్నాడు. నామమాత్రంగా ఇప్పటికి లూసిఫర్ అనే టైటిల్ కంటిన్యూ అవుతోంది. తర్వాత మార్చుతారో లేదో తెలియదు. ఈ సినిమా ఒరిజినల్ మాత్రం మలయాళంలో తెరకెక్కింది. అయితే ఈ రీమేక్ సినిమాకు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు చిరు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.

త్వరలోనే షూటింగ్ ప్రారంభం చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ గురించి వార్తలొస్తున్నాయి. నిజానికి ఒరిజినల్ లూసిఫర్ లో హీరోయిన్ లేదు. మెగాస్టార్ చిరు డిమాండ్ మేరకు హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసాడట డైరెక్టర్. ఒకవేళ హీరోయిన్ క్యారెక్టర్ ఉన్నా ఎంత నిడివితో ఉంటుంది. పాటల వరకే అంకితం అవుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ సినిమాలో హీరోయిన్ లేదనేది తాజా వార్త. కానీ అసలు లూసిఫర్ గురించి ఏ వార్తలు కూడా బయటికి రానివ్వలేదు మేకర్స్. ఇదిలా ఉండగా.. ఈ సినిమా టైటిల్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లూసిఫర్ సినిమాకు 'కింగ్ మేకర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయాలన్నీటిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ ఆఫీసియల్ గా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News