యంగ్ హీరో బర్త్ డే కు కూడా అప్డేట్ లేదేంటి?
ఈ నేపథ్యంలోనే తర్వాతి సినిమా విషయంలో వైష్ణవ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.;
మెగా మేనల్లుడు, సాయి దుర్గ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. హీరోగా మొదటి సినిమాతోనే సక్సెస్ అవడం మామూలు విషయం కాదు. ఉప్పెన కేవలం హిట్ మాత్రమే కాకుండా ఏకంగా రూ.100 కోట్లు కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరించింది. ఉప్పెనలో తన యాక్టింగ్ తో అందరి దృష్టినీ అలరించారు వైష్ణవ్.
ఉప్పెన తర్వాత వరుస అవకాశాలు
మొదటి సినిమాతోనే తనదైన మార్క్ వేసిన వైష్ణవ్ తో సినిమాలు చేయడానికి ఆ తర్వాత నిర్మాతలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించారు. వైష్ణవ్ కూడా వచ్చిన అవకాశాలను వాడుకుని వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఉప్పెన తర్వాత కెరీర్లో బాగానే బిజీ అయ్యారు. కానీ ఉప్పెన తర్వాత వైష్ణవ్ నుంచి వచ్చిన కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలు ఫ్లాపులుగానే మిగిలాయి.
వరుస ఫ్లాపులతో మార్కెట్ పై ఎఫెక్ట్
ఆదికేశవ తర్వాత వైష్ణవ్ నుంచి మరో సినిమా రాలేదు. వరుస ఫ్లాపులు రావడంతో ఆ ప్రభావం అతని కెరీర్ పై బాగా పడింది. ఈ నేపథ్యంలోనే తర్వాతి సినిమా విషయంలో వైష్ణవ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వైష్ణవ్ ఎంతో మంది డైరెక్టర్లను కలిసి వారి కథలు వింటున్నారు తప్పించి ఒక్క కథను కూడా ఇంకా ఫైనల్ చేయలేదు. ఫలితంగా వైష్ణవ్ కెరీర్లో రెండేళ్లు ఈ యంగ్ హీరో ఖాళీగా ఉండాల్సి వచ్చింది.
రెండేళ్లుగా ఖాళీగానే
ఇప్పటికే రెండేళ్లు వేస్ట్ అయింది, వైష్ణవ్ తేదీ కొత్త సినిమా అప్డేట్ ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే జనవరి 13న వైష్ణవ్ బర్త్ డే. ఈ రోజు అతను తన 30వ బర్త్ డే ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతని కొత్త సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని అందరూ అనుకున్నారు. ఈ స్పెషల్ డే సందర్భంగా కూడా వైష్ణవ్ కొత్త సినిమా అప్డేట్ ఏమీ రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. మరి వైష్ణవ్ ఎందుకు ఇంత టైమ్ తీసుకుంటున్నారో తెలియాల్సి ఉంది.