సంక్రాంతిని అనీల్ కి రాసిచ్చేయాల్సిందే!
సంక్రాంతి సీజన్ ఏ స్టార్ హీరో..డైరెక్టర్ మిస్ చేసుకోరు. అవకాశం ఉంటే ఆ సీజన్ లో కచ్చితంగా ఓ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమా యావరేజ్ గా ఉన్నా ఆడేస్తుంది.;
సంక్రాంతి సీజన్ ఏ స్టార్ హీరో..డైరెక్టర్ మిస్ చేసుకోరు. అవకాశం ఉంటే ఆ సీజన్ లో కచ్చితంగా ఓ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమా యావరేజ్ గా ఉన్నా ఆడేస్తుంది. సినిమాకు మంచి లాభాలు వస్తాయి అన్న ధీమాతో ఉంటారు. అలా అన్ని సార్లు వర్కౌట్ అవ్వదు. బొక్కబోర్లా పడ్డా చిత్రాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ విషయంలో అనీల్ రావిపూడి మాత్రం ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఇంత వరకూ అతడు డైరెక్ట్ చేసిన తొమ్మిది సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. వాటిలో ఏ ఒక్క చిత్రం ఫెయిల్ అవ్వలేదు. వాటిలో నాలుగు సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అయి కోట్ల వర్షం కురిపించాయి.
ఇందులో అనీల్ రికార్డే సృష్టించాడు. వైఫల్యం లేకుండా నాలుగు సంక్రాంతులు తనదే అనిపించాడు. ఇంత వరకూ ఏ డైరెక్టర్ పేరిట అలాంటి రికార్డు లేదు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే ఆరేళ్ల క్రితంఅనీల్ ఈ రకమైన విజయానికి బీజం వేసాడు. 2019 సంక్రాంతికి వెంకటేష్-వరుణ్ సందేశ్ నటించిన `ఎఫ్ 2` రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 127 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ మరుసటి ఏడాది 2020లో సూపర్ స్టార్ మహేష్ తో `సరిలేరు నీక్వెవరు` తెరకెక్కించి సంక్రాంతికే రిలీజ్ చేసాడు. ఈ సినిమా ఏకంగా 180 కోట్ల వసూళ్లను సాధించింది.
గత సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో తెరకెక్కించిన `సంక్రాంతి వస్తున్నాం` తో సంక్రాంతికే ప్రేక్షకుల ముందు కొచ్చారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల వసూళ్లతో అనీల్ కెరీర్ లో భారీ వసూళ్ల చిత్రంగా నిలిచింది. ఈ రేంజ్ వసూళ్లను సాధిస్తుందని అనీల్ కూడా ఊహించలేదు. 100 కోట్లు రాబడితే ఎక్కువ అనుకున్న సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసే సరికి అనీల్ పేరు మరోసారి మారు మ్రోగిపోయింది. సీనియర్ హీరోల్లో వసూళ్ల పరంగా వెంకీ ఆ రికార్డు. తాజాగా ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవిని వదిలాడు అనీల్. ఇద్దరి కాంబినే షన్ లో రిలీజ్ అయిన `మనశంకర వరప్రసాద్ గారు` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
సక్సెస్ పుల్ గా థియేటర్లలలో దూసుకుపోతుంది. ఈ సంక్రాంతి కూడా అనీల్ దే అనిపించాడు. దీంతో సంక్రాంతి సీజన్ కి అనీల్ ఓ బ్రాండ్ గా మారిపోయాడు. ఇప్పటి వరకూ ఏ డైరెక్టర్ ఇలా సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ రేంజ్ లో విజయాలు అందుకోలేదు. దీంతో అనీల్ ప్రతీ సంక్రాంతికి ఓ సినిమా ప్లాన్ చేసుకుంటే సరి. సక్సెస్ సెంటిమెంట్ ఎలాగూ కలిసొస్తుంది.