బన్నీ గురించి తమ్ముడు శిరీష్ చెప్పిన ఆసక్తికర విషయాలు..!
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ - అల్లు శిరీష్ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే బన్నీ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎడిగారు. ఇక శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు' 'ఒక్క క్షణం' వంటి సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించాడు. 'ఎబిసిడి' హిందీ డబ్బింగ్ సినిమాతో నార్త్ లో కూడా క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల 'విలాయటి శరాబ్' అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ తో 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సత్తా చాటాడు. అలానే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ చేసిన ఫస్ట్ సౌత్ హీరోగా అల్లు శిరీష్ నిలిచాడు. ఈ నేపథ్యంలో అన్న అల్లు అర్జున్ సైతం తమ్ముడు చేసిన ఫస్ట్ హిందీ సాంగ్ సక్సెస్ అయినందుకు సోషల్ మీడియా ద్వారా అభినందించాడు. దీనిపై అల్లు శిరీష్ రీసెంటుగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన బ్రదర్ అభినందనలు తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపాడు.
''బన్నీ ప్రోత్సాహం నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే అతను చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టడం అనేది చిన్న విషయమైనా నాకు అది పెద్దది. ఎందుకంటే అతనికి బాగా నచ్చితే తప్ప అఫ్రిసియేట్ చేయడు, దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడు. నేను నటించిన చాలా సినిమాల ఫస్ట్ లుక్ లేదా ట్రైలర్ గురించి ట్వీట్ చేయలేదు. బాగా ఆకట్టున్న వాటినే మెచ్చుకుంటాడు" అని శిరీష్ అన్నారు. ''నేను ఇలా కొత్త విషయాలను ట్రై చేయడం పట్ల బన్నీ హ్యాపీగా ఉన్నాడు. చాలా మంది మ్యూజిక్ వీడియోస్ చేయడానికి ముందుకురారు. అందుకే ఇప్పుడు నేను చేస్తున్న దానిని అభినందించాడు. నేను చేసిన ఈ వీడియో సాంగ్ కూడా నచ్చింది'' అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా హిందీలో సరైన అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. హిందీలో చేసినట్లుగానే తెలుగు లేదా తమిళ్ లో ఒక మ్యూజిక్ వీడియో చేయాలనుకుంటున్నానని అల్లు శిరీష్ ఈ సందర్భంగా అన్నారు.