చరణ్ డెబ్యూ ఛాన్స్.. జక్కన్న కేర్ లెస్!
నటవారసుల్ని పరిచయం చేయడం అంటే ఆషామాషీనా?.. అదో సవాల్ లాంటిది. ఏమాత్రం తేడా జరిగినా ఫ్యాన్స్ అస్సలు క్షమించరు. దర్శకుడిపై కక్ష కట్టేస్తారు! సరిగ్గా ఇదే కారణం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిని భయపెట్టిందా? మెగా వారసుడి డెబ్యూ అవకాశం తననే వరించినా కాదని అన్నారా? అంటే అవుననే తెలుస్తోంది.
నటవారసుడు రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేయాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రాజమౌళిని కోరారట. కానీ ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాతనే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి అవకాశం దక్కింది. చిరుత చిత్రంతో చరణ్ ని హీరోగా పరిచయం చేశారు పూరి. నటించిన తొలి సినిమాతోనే తనలో కమర్షియల్ కంటెంట్ అంతా బయటపడిందంటే అది పూరి వల్లనే. చిరుత సినిమాతో డ్యాన్సులు.. ఫైట్స్ బాగా చేయడమే గాక రొమాన్స్ లో ఎమోషన్స్ పండించడంలో చరణ్ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే వేయించుకున్నాడు.
14 ఏళ్ల క్రితం చరణ్ `చిరుత` సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. రెండో సినిమా మగధీరకు రాజమౌళి దర్శకత్వం వహించారు. కెరీర్ లో అపజయమెరుగని దర్శకుడిగా అప్పటికే రాజమౌళికి ఉన్న గుర్తింపు దృష్ట్యా డెబ్యూ ఛాన్స్ తో పాటు రెండో సినిమా అవకాశం కూడా ఇచ్చారు చిరు. చరణ్ ని పరిచయం చేసేందుకు సాహసించక పోయినా.. రెండో ఛాన్స్ ని మాత్రం రాజమౌళి ఓ రేంజులోనే ఉపయోగించుకున్నారు. మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేసి సత్తా చాటారు.
సరిగ్గా 14 ఏళ్ల తర్వాత ఆర్.ఆర్.ఆర్ చిత్రం కోసం రామ్ చరణ్ - రాజమౌళి కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నారు? అన్నది ఆసక్తిగా మారింది. చరణ్ ని డెబ్యూ హీరోగా తిరస్కరించడానికి కారణం .. అతడు ఎలా ఉంటాడు.. ఎలా నటిస్తాడు.. ప్లస్ - మైనస్ లేమిటి? డ్యాన్సులు ఫైట్స్.. ఎమోషన్స్ లో ఎలా ఉంటాడు? ఇవేవీ తనకు తెలియక పోవడమే కారణమని రాజమౌళి ఆ తర్వాత తెలిపారు. ఇవన్నీ తెలిస్తేనే రాజమౌళి సినిమా చేస్తారు. చిరుతతోనే చరణ్ అవన్నీ చేసి చూపించగలనని నిరూపించి రాజమౌళి మెప్పు పొందారు.