శృతికి షాక్ ఇచ్చిన ఇన్ స్టా స్టోరీస్!!
సౌత్ లో మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్స్ లో శృతిహాసన్ ఒకరు. కమల్ హాసన్ డాటర్ గా శృతికి ముందు నుంచి స్టార్ కిడ్ అనే పాపులారిటీ ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎత్తుపల్లాలు అన్నీ చూసి.. ఇతర హీరోయిన్ల లాగే కెరీర్లో పైకి ఎదిగింది. మధ్యలో లవ్.. బ్రేక్ అప్ ఎపిసోడ్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ భామ అందరిలాగే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంది. ఈతరం భామల అందరూ సోషల్ మీడియా లో బిజీగా ఉంటారు కదా. శృతి కూడా అంతే.
తాజాగా ఇన్స్టా లో వుడ్ యు రా దర్ అనే గేమ్ ఆడింది. ఈ ఇన్ స్టా స్టోరీస్ గేమ్ లో భాగంగా ఆటోమేటిక్ ఫిల్టర్ శృతికి ఒక ప్రశ్న సంధించింది. "మీరు మీ మాజీ పై నిఘా పెడతారా.. లేదా అతడు మీ పై నిఘా పెడతాడా?" అర్థమైంది కదా.. చాలామంది మాజీ లను మర్చిపోలేరు.. ఎంతసేపు వారు ఏం చేస్తున్నారా.. మరొకరిని తగులుకున్నారా.. లేక బాధలో ఉన్నారా.. ఇలాంటివి కనుక్కునేందుకు అదే పనిగా వారి సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతుంటారు. పోస్టులను తనిఖీ చేస్తుంటారు. ఇలాంటి వ్యవహారం తమరూ చేస్తారా? లేదా ఆ మైఖేల్ చేస్తాడా అని అడిగినట్టు. దీనికి శృతి ఒక్క సారిగా షాక్ అయింది.. ఫన్నీ ఫేస్ తో "నేను..ఎక్స్ ను? ఓరి దేవుడా.. రెండు కాదు" అంటూ సమాధానం ఇచ్చింది.
ఇదిలా ఉంటే ఈ మధ్య నాన్నగారు కమల్ హాసన్ తో పాటు 'అవిరుం అన్బుమ్' అంటూ సాగే ఒక కరోనా అవగాహన గీతంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'క్రాక్'.. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న 'లాబం' సినిమాల్లో నటిస్తోంది.