క్రికెట్ మరియు సినిమాలను ఒకటి చేస్తూ 'అరణ్య' వినూత్న ప్రమోషన్స్..!

Update: 2021-03-20 13:53 GMT
రానా దగ్గుబాటి హీరోగా ప్ర‌భు సాల్మ‌న్ తెరకెక్కిస్తున్న త్రిభాషా చిత్రం ''అరణ్య''. విష్ణు విశాల్ - జోయా హుస్సేన్‌ - శ్రియ పిల్గావోంక‌ర్ ఇతర ప్రధాన పాత్ర‌లు పోషించారు. ఈ తెలుగుతో పాటుగా హిందీలో ‘హథీ మేరే సాథి’.. తమిళంలో ‘కాదన్’ అనే పేర్లతో మార్చి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్ర యూనిట్.. ట్రైలర్ - సాంగ్స్ తో సినిమాపై అంచనాలు కలిగించారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా హీరో రానా.. నేడు జరుగుతున్న ఇండియా vs ఇంగ్లాండ్ 5వ టి-20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ లైవ్ కి రానున్నారు.

'అరణ్య' సినిమా విశేషాలతో పాటు క్రికెట్ కు సంబంధించిన విషయాల గురించి రానా మాట్లాడనున్నారు. తెలుగువారికి ఎంతో ఇష్టమైన క్రికెట్ మరియు సినిమాలను ఒకటి చేస్తూ 'అరణ్య' చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తోంది. అలానే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. విక్టరీ వెంకటేష్ - శేఖర్ కమ్ముల - గుణ శేఖర్ దీనికి గెస్టులుగా హాజరుకానున్నారు. ఇకపోతే ఈ సినిమా పర్యావరణ సమస్యలు - అటవీ నిర్మూలన - జంతువుల సంరక్షణ వంటి అంశాలతో రూపొందించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత రసూల్‌ పోకుట్టి సౌండ్‌ డిజైన్ చేయగా.. ఎ.ఆర్‌. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వ్యవహరించాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News