ఇండియ‌న్ ఐర‌న్ మ్యాన్ స‌డెన్ గా ఎక్కడి నుంచి దిగాడు!

Update: 2023-04-07 21:22 GMT
పఠాన్ లో షారూఖ్ ఖాన్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ రీయూనియన్ తర్వాత సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం `కిసీ కా భాయ్ కిసీ కి జాన్` విజ‌యం కోసం క‌ఠోరంగా శ్ర‌మించాడు. ఈ సినిమా విడుదలకు ముందు భాయ్ విభిన్న ప్ర‌చార శైలితో అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాడు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం కిసీ కా భాయ్.. ఈ నెలాఖరున ఈద్ సందర్భంగా ఏప్రిల్ 21న విడుదలవుతోంది.

తాజాగా స‌ల్మాన్ వ్యాయామశాల నుంచి ఒక సాధారణ ఫోటోను పోస్ట్ చేసాడు. ఇది చూడ‌టానికి ఎంతో సాధార‌ణంగా క‌నిపించినా కానీ భాయ్ ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ మైండ్ బ్లాక్ చేస్తోంద‌ని అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. సల్మాన్ నల్లటి టీ-షర్ట్ - షార్ట్ ధరించి ఉండగా తలపై తెల్లటి టవల్ వేసుకుని ఎంతో క్యాజువ‌ల్ గా నిలుచుని క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

సినిమా విడుదల తేదీ `21 ఏప్రిల్ #KBKJ` అని ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చాడు. బిగ్ బాస్ 16 మాజీ కంటెస్టెంట్  గాయకుడు అబ్దు రోజిక్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ లో చిన్న పాత్రలో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. అత‌డు ఈ ఫోటోపై స్పందిస్తూ -``ఐరన్ మ్యాన్ (కండరపుష్టి - బ్లూ హార్ట్ ఎమోజీలు) స్ఫూర్తితో నేను కూడా  ఒక రోజు అలాగే ఉంటాను`` అని రాశారు. నటుడు వివాన్ బతేనా వ్యాఖ్యానిస్తూ.. ఎల్లప్పుడూ ప‌ర్ఫెక్ట్ షేప్ లో ఉంటారు సార్ (చేతులు చప్పట్లు కొడుతూ ఎమోజీ).. అరి పొగిడేశాడు. ఫిట్ నెస్ పై ఆసక్తి ఉన్న నటుడు అని బని జె జోడించారు.

`కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌`లో గత కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ న‌టించిన ఏ ఇత‌ర సినిమాలోను క‌నిపించ‌ని డిఫ‌రెంట్ తారాగణం క‌నిపిస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి- పూజా హెగ్డే- జగపతి బాబు- జాస్సీ గిల్- రాఘవ్ జుయల్ సిద్ధార్థ్ నిగమ్- భూమిక చావ్లా - భాగ్యశ్రీ కూడా నటించారు. సల్మాన్ తల్లి స‌మ‌ర్ప‌ణ‌లో సల్మాన్ ఖాన్ హోమ్ ప్రొడక్షన్ లో తెర‌కెక్కిన ఈ చిత్రంతోనే షెహనాజ్ గిల్ -పాలక్ తివారీ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. RRR నటుడు రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో ఏంటమ్మా పాట కోసం ప్రత్యేక అతిధిగా మెరుస్తున్నారు.

ఇటీవల స‌ల్మాన్ ఓ చాటింగ్ సెష‌న్ లో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ముచ్చ‌టించారు. తాను మునుముందు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను హోస్ట్ చేస్తానని ప్రకటించిన వేదిక‌పై సల్మాన్ తనతో పాటు వచ్చిన షారుఖ్- అమీర్ ఖాన్- అజయ్ దేవగన్ -అక్షయ్ కుమార్ లాంటి సహా నటులతో క‌లిసి ప‌ని చేసేందుకు ప్ర‌ణాళిక‌ల‌పై తన ఆలోచనలను షేర్ చేసాడు. అతను యువ తరం గురించి ప్ర‌శంస‌లు కురిపించాడు. సల్మాన్ కత్రినా కైఫ్ తో కలిసి యశ్ రాజ్ ఫిల్మ్ టైగర్ 3 లో న‌టిస్తున్నాడు. ఈ సంవత్సరం చివర్లో  ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. షారుఖ్ టైగ‌ర్ 3లో పఠాన్ గా రీఎంట్రీ ఇవ్వ‌డం బిగ్ స‌ర్ ప్రైజ్ కానుంది.

ఖ‌రీదైన బుల్లెట్ ప్రూఫ్ కార్

స‌ల్మాన్ భాయ్ పై గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపుల నేప‌థ్యంలో ఇటీవ‌ల ముంబై పోలీసులు భ‌ద్ర‌త‌ను అమాంతం పెంచిన సంగ‌తి తెలిసిందే. అత‌డు ప్ర‌స్తుతం బుల్లెట్ ప్రూఫ్ కార్ ల‌లో ప్ర‌యాణిస్తున్నాడు. తాజా స‌మాచారం మేర‌కు ఇండియాలో ఇంకా అందుబాటులో లేని అత్యంత ఖ‌రీదైన నిస్సాన్ (పెట్రోల్ ఎస్.యు.వి) బ్రాండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ని కొనుగోలు చేసాడ‌ని తెలిసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News