• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్ 2కి విముక్తి.....

ఇండియన్ 2కి విముక్తి.. త్వరలోనే రీస్టార్ట్

By - Tupaki Desk
Update: 2022-06-14 12:30 GMT
విశ్వనటుడు కమల్ హాసన్ మొత్తానికి విక్రమ్ సినిమాతో బాక్సాఫీసలెస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వరుస పరాజయాలతో చాలాకాలంగా కాస్త సతమతమవుతున్న కమల్ హాసన్ ఇప్పుడు విక్రమ్ సినిమా విజయోత్సవంలో ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విక్రమ్ సినిమాకి పనిచేసిన అందరికీ కూడా ప్రత్యేకమైన కానుకలు కూడా ఇచ్చారు. ఇక ఇదే తరహాలో తదుపరి  సినిమాలతో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కమల్ హాసన్ ప్రణాళికలు రచిస్తున్నారు.

అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ఇండియన్ 2 సినిమా మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరగా మొదలుపెట్టాలి అని చూస్తున్నారు.

మధ్యలో బడ్జెట్ కారణాల వలన నిర్మాణ సంస్థకు దర్శకుడి విభేదాలు తలెత్తడంతో ఆ ప్రాజెక్ట్ మళ్లీ మొదలు కాదేమో అనే సందేహాలు కూడా చాలాసార్లు వచ్చాయి.  నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అలాగే దర్శకుడు శంకర్ తో కూడా కమల్ హాసన్ చర్చలు జరిపాడు.

లైకా ప్రొడక్షన్ మీద కోపంతోనే దర్శకుడు శంకర్ రామ్ చరణ్ తో తన 15వ సినిమాను కూడా మొదలు పెట్టేసాడు. ఇక ఆ తర్వాత ఆ ప్రాజెక్టు మొదలవ్వదేమో అని కూడా అనుకున్నారు. ఇక ఇప్పుడు కమల్ విక్రమ్ విజయానందంలో ఇండియన్ 2 సినిమాను మళ్లీ మొదలు పెట్టడానికి కృషి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాణ సంస్థ ఇప్పటికే కమల్ హాసన్ మాటకు కట్టుబడి ప్రాజెక్టు మొదలు పెట్టడానికి సిద్ధమైంది.

దర్శకుడు శంకర్ కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే 150 కోట్లకు పైగా ఖర్చు చేసి మధ్యలో వదిలేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని ప్రాజెక్ట్ మెసేజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట.

శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్టు అయిపోగానే ఇండియన్ టల్2 సినిమా షూటింగ్ మళ్లీ మొదలవుతుంది అని తెలుస్తోంది. ఇక ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాదే చివరలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి ఆ సినిమా కమల్ హాసన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Tags:    
  • Indian2 
  • KamalHassan 
  • Shankar 
  • Vikram 
  • RamCharan 
  • RC15 
  • Shooting 
  • MovieNews 

Similar News

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

Copyright @2026

Powered by Blink CMS