• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్‌ లేకుండా ఇండియన్‌ 2...

కమల్‌ లేకుండా ఇండియన్‌ 2 పునః ప్రారంభం

By - Tupaki Desk
Update: 2022-08-24 05:36 GMT
తమిళ్‌ సినీ ప్రేమికులతో పాటు తెలుగు మరియు ఇతర భాషల సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ పునః ప్రారంభం అవ్వబోతుంది. రేపటి నుండి చెన్నై లో శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్ 2 షూటింగ్ ను నిర్వహించబోతున్నట్లుగా ప్రొడక్షన్ హౌస్‌ తమిళ మీడియాకు అధికారికంగా తెలియజేయడంతో కమల్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రామ్‌ చరణ్ తో శంకర్ చేస్తున్న సినిమా కు కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ గ్యాప్ లో ఇండియన్ 2 సినిమా ను కమల్‌ హాసన్ ముగించాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే చెన్నై లో ఇండియన్ 2 సినిమా యొక్క నిర్మాణ కార్యక్రమాలను మొదలు పెట్టాడు. సిద్ధార్థ్ తో పాటు ఇతర ముఖ్య నటీ నటుల పై రేపటి నుంచి చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లుగా లైకా ప్రొడక్షన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే కమల్‌ హాసన్‌ జాయిన్ అవ్వడం లేదట. విశ్వసనీయంగా అందుతున్న తమిళ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఇండియన్‌ 2 లో సెప్టెంబర్ 5వ తారీకు నుండి కమల్‌ హాసన్‌ జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్ కి సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది.

ఇండియన్ 2 సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. ఏదో కారణం వల్ల షూటింగ్ కి బ్రేక్ పడుతూ వచ్చింది. ఆ మధ్య షూటింగ్‌ సందర్భంగా యాక్సిడెంట్ అవ్వడంతో అప్పటి నుండి షూటింగ్ పూర్తిగా పక్కకు పెట్టారు. దాంతో లైకా వారికి శంకర్ కి మధ్య విభేదాలు తలెత్తాయి. కోర్టు వరకు ఈ గొడవలు వెళ్లాయి. మధ్యవర్తి ద్వారా ఈ సమస్య పరిష్కారం చేసుకోవాలంటూ కోర్టు సూచించింది.

మధ్యవర్తులు మరియు ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడటంతో శంకర్ మరియు లైకా ప్రొడక్షన్స్ మధ్య రాజీ కుదిరింది. ఇండియన్‌ 2 సినిమాను రెండు నెలల్లో పూర్తి చేసేందుకు శంకర్ ఓకే చెప్పాడు. దాంతో వెంటనే లైకా ప్రొడక్షన్స్ వారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టారు.

కమల్‌ 'విక్రమ్‌' సినిమా తో సక్సెస్ దక్కించుకోవడంతో ఇండియన్‌ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఆలస్యం చేయకుండా ఈ ఏడాది చివరి వరకు ఇండియన్ 2 ను ముగించి వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.
Tags:    
  • KamalHassan 
  • Indian2 
  • Shankar 
  • Director 
  • RamCharan 
  • Chennai 
  • Shooting 
  • Accident 
  • TupakiNews 
  • MovieNews 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS