• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్ 2 ఓ ఇంట్రెస్టింగ్...

ఇండియన్ 2 ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది

By - Tupaki Desk
Update: 2022-12-16 04:11 GMT
యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌.. శంకర్ కాంబినేషన్ లో రూపొంది ఆల్‌ టైమ్‌ సూపర్‌ హిట్ సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్న చిత్రం భారతీయుడు. ఆ సినిమా వచ్చి చాలా ఏళ్లు అవుతున్న విషయం తెల్సిందే. దాదాపుగా దశాబ్ద కాలంగా ఆ సినిమాకు సీక్వెల్‌ ను రూపొందించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఎట్టకేలకు రెండున్నర మూడు సంవత్సరాల క్రితం ఇండియన్ 2 ను మొదలు పెట్టారు. కానీ టైమ్‌ సరిగాలేదో మరేమైందో కానీ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా ఏదో ఒక అడ్డంకి వచ్చింది. దాంతో శంకర్ సినిమా నుండి పూర్తిగా తప్పుకున్నాడు. నిర్మాణ సంస్థతో గొడవలు.. మధ్యవర్తులు రాజీ కుదిర్చి చివరకు మళ్లీ ఇండియన్ 2 ను మొదలు పెట్టారు.

ఇండియన్ 2 సినిమా రచయిత జయమోహన్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ఇండియన్ సినిమాలో సేనాపతి మరియు ఆయన కొడుకు కథను చూపించడం జరిగింది. కానీ ఈ సినిమాలో మాత్రం సేనాపతి మరియు ఆయన తండ్రి కథను చూపించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

ఆయన మాటలను బట్టి చూస్తూ ఉంటే ఇండియన్ 2 సినిమా కథ స్వాతంత్య్రానికి పూర్వం కథతో సాగబోతున్నట్లుగా తెలుస్తోంది.

సేనాపతి మరియు ఆయన తండ్రి పాత్రను కమల్‌ వేస్తున్నాడట. ఇండియన్ సినిమా చూసిన అనుభూతినే ఇండియన్ 2 సినిమా చూసినప్పుడు కూడా కలుగుతుందని ఆయన పేర్కొన్నాడు.

సినిమా కోసం కమల్‌ హాసన్‌ చాలా కష్టపడుతున్నాడని జయ మోహన్‌ పేర్కొన్నాడు. తప్పకుండా ఈ సినిమా గత ఇండియన్‌ సినిమా మాదిరిగానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ను వ్యక్తం చేశాడు. షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.. వచ్చే ఏడాది సమ్మర్ లో ఇండియన్ 2 విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • India2 
  • UniversalStar 
  • KamalHassan 
  • Shankar 
  • WriterJayMohan 
  • Senapathi 
  • MovieNews 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS