వర్మ కంపెనీ నుండి మరో బ్యూటీకి బిగ్ బాస్ ఛాన్స్!
తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్ సందడి షురూ కాబోతుంది. ఇప్పటి వరకు రెగ్యులర్ బిగ్ బాస్ సీజన్ లు 5 పూర్తి అవ్వగా ఓటీటీ బిగ్ బాస్ సీజన్ ఒకటి పూర్తి అయ్యింది. మరో వారం రోజుల్లో రెగ్యులర్ బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ మా లో ప్రారంభం కాబోతుంది. భారీ ఎత్తున ప్రేక్షకులు అంచనాలు పెంచుకుని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
బిగ్ బాస్ సీజన్ 6 యొక్క కంటెస్టెంట్స్ విషయంలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదటి నుంచి ఉదయ భాను షో లో ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆమెకు అత్యధిక పారితోషికం అని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం బిగ్ బాస్ లో ఉదయభాను ఉండేది అనుమానమే అంటున్నారు.
ఇక బిగ్ బాస్ సీజన్ 6లో వర్మ కంపెనీకి చెందిన ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇనాయ సుల్తానా అనే నటి గతంలో ఎన్నో సార్లు వర్మ తో వేడుకల్లో పాల్గొన్నది.. ఆయనతో డాన్స్ చేసిన వీడియోలు మరియు వర్మ ఆమెతో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలోనే చాలా మంది ఎవరు ఈ ఇనాయ సుల్తానా అంటూ నెట్ లో సెర్చ్ చేశారు.
గతంలో వర్మ వల్ల గుర్తింపు దక్కించుకున్న అరియానా రెండు సార్లు బిగ్ బాస్ లో అడుగు పెట్టింది. ఆమె వర్మ తో ఇంటర్వ్యూ వల్ల వచ్చిన గుర్తింపు తోనే తనకు బిగ్ బాస్ అవకాశం దక్కిందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇక శ్రీ రాపాక కూడా వర్మ కంపెనీ నుండి బిగ్ బాస్ లో అడుగు పెట్టింది.
మొత్తానికి బిగ్ బాస్ కు చాలా మంది ముద్దుగుమ్మలను రామ్ గోపాల్ వర్మ అందిస్తున్నాడు. వచ్చే సీజన్ లో మరో ముద్దుగుమ్మ ను కూడా రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుండే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయన కంపెనీ నుండి వచ్చే ముద్దుగుమ్మలు అందాల ఆరబోత విషయంలో చాలా బోల్డ్ గా ఉంటారు అనేది బిగ్ బాస్ నిర్వాహకుల అభిప్రాయం కావచ్చు. అందుకే వారిని తీసుకుంటారు. ఇనాయ సుల్తానా ఏ స్థాయి అందాల ఆరబోత చేస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.