• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్: ఆసక్తిని...

టీజర్: ఆసక్తిని రేకెత్తిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్'..!

By - Tupaki Desk
Update: 2021-05-28 15:44 GMT
కమెడియన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి.. ఇప్పుడు విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. కామెడీతో నవ్విస్తూనే సీరియస్ రోల్స్ తో మెప్పిస్తున్నాడు. స్క్రిప్ట్ సెలక్షన్ లో వైవిధ్యాన్ని చూపిస్తూ, తనలోని నటుడిని బయటకు తీస్తున్నాడు. వెబ్ వరల్డ్ లో కూడా అడుగుపెట్టిన ప్రియదర్శి.. ఇప్పుడు ''ఐ.ఎన్.జి''(ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్) అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తో వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ విశేష స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా 'ఐ.ఎన్.జి' టీజర్ ను రిలీజ్ చేశారు.

ఓ పిట్టకథ చెబుతున్న విలక్షణ నటుడు జగపతి బాబు వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. ''ఉడత ను ఎట్లా పట్టుకుంటారో తెలుసా.. ఒక చెట్టుకు చిన్న తొర్ర చేసి, అందులో ఆహారం వేస్తారు. ఉడత అందులో తలదూరుస్తుంది. కానీ తిరిగి బయటికి రాలేదు.. అప్పుడు దాని తల కోసి దాన్ని ఈజీగా బయటికి తీస్తారు'' అంటూ ఇంట్రెస్టింగ్ గా చెప్తూ ఒక్కొక్క క్యారక్టర్ ని రివీల్ చేశారు. నందినీ రాయ్ - ప్రియదర్శి మధ్య రొమాంటిక్ సీన్ తో మొదలై.. దర్శిని వెంటాడటం.. తిరగబడి వాళ్ళని కొట్టడం వంటి సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించారు. దురాశ - కామం - ప్రతీకారం వంటి అంశాలతో ముడిపడిన ఈ టీజర్ బోల్డ్ గా ఉంది.

అలానే క్రైమ్ సన్నివేశాలు కలబోసిన ఈ టీజర్ థ్రిల్లింగ్‌ గా ఉత్కంఠ భరితంగా సాగింది. 'పరిస్థితుల బాగోలేనప్పుడు ఎగిరెగిరి పడకూడదు.. అన్నీ మూసుకొని కూర్చోవాలి' అనే డైలాగ్ తో ముగించిన ఈ టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ''ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్'' (ఐ.ఎన్.జి) క్రైమ్ థ్రిల్లర్ ని కొత్త దర్శకుడు విద్యాసాగర్ ముత్తుకుమార్ రూపొందిస్తున్నారు. 'బాషా' చిత్రాన్ని తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ.. సురేష్ కృష్ణ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. వరుణ్ డీకే సినిమాటోగ్రఫీ అందించగా.. నిఖిల్ శ్రీకుమార్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. దీపక్ అలెగ్జాండర్ సంగీతం సమకూరుస్తున్నారు. జూన్ నెలలో తెలుగు ఓటీటీ 'ఆహా' లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.


Full View
Tags:    
  • Priyadarshi 
  • In The Name Of God 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS