'లక్ష్య'లో జగపతిబాబు ఒక రేంజ్ లో చెలరేగిపోతాడట!

Update: 2021-03-25 02:30 GMT
లక్ష్యలో జగపతిబాబు ఒక రేంజ్ లో చెలరేగిపోతాడట!
జగపతిబాబు .. ఇప్పుడు ఈ పేరు విలన్ పాత్రలకు .. విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. కార్పొరేట్ స్థాయి విలనిజమైనా .. విలేజ్ స్థాయిలోని పవర్ఫుల్ విలనిజమైనా జగపతిబాబు నడిపించే తీరు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కార్పొరేట్ విలన్ గా స్టైలిష్ గా డైలాగ్స్ చెప్పడంలోను, గ్రామీణ ప్రతి కథానాయకుడిగా యాసతో కూడిన డైలాగ్స్ చేపడంలోను ఆయన సిద్ధహస్తుడు. తన లుక్ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ కొత్తగా కనిపిస్తుండటం ఆయన విజయరహస్యాల్లో ఒకటి.

ప్రస్తుతం జగపతిబాబు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రెండేళ్లపాటు ఆయన విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మరింతగా మెప్పించనున్నారు. నాని హీరోగా చేస్తున్న 'టక్ జగదీశ్'లోను .. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న 'రిపబ్లిక్' సినిమాలోను .. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' సినిమాలోను ఆయన వైవిధ్యభరితమైన పాత్రలలో కనిపించనున్నారు. అలాగే 'మహాసముద్రం' .. 'గని' .. 'లక్ష్య' సినిమాల్లోను ఆయన డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ పాత్రలన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేనివి కావడం విశేషం.

ఈ సినిమాలన్నింటిలోను ఆయనవి చెప్పుకోదగిన పాత్రలే. అయితే 'లక్ష్య' సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర మరింత డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి .. గ్రామీణ నేపథ్యంలోని ఈ పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేశాడట. ఇంతవరకూ నటనపరంగా జగపతిబాబులో కనిపించని కోణాన్ని ఆయన ఈ సినిమలో ఆవిష్కరించనున్నట్టు చెబుతున్నారు. ఆయన లుక్ .. డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా పూర్తి వైవిధ్యంగా ఉంటాయని అంటున్నారు. 'అరవింద సమేత' సినిమాలోని బసిరెడ్డి పాత్ర .. 'రంగస్థలం'లోని ఫణింద్ర భూపతి పాత్ర మాదిరిగానే, 'లక్ష్య' సినిమాలోని పాత్ర జగపతిబాబు కెరియర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
Tags:    

Similar News