సల్మాన్ ఖాన్ తో.. ఇమ్రాన్ హష్మి పంచాయితి!
ఇమ్రాన్ హష్మి అంటే.. అమ్మాయిల కలల రాకుమారుడు. అబ్బాయిలకు కూడా ఆదర్శ పురుషుడే! అలవోకగా.. లిప్ టూ లిప్ లాక్ చేసే ఇమ్రాన్ చూసి జలసీ ఫీలయ్యేవారు యూత్. మనోడి హవా అలా ఉండేది మరి! కానీ.. చూసిన లిప్ కిస్ ను ఎన్ని సార్లు చూస్తారు.. బోర్ కొట్టదూ..?! అదే జరిగింది. అయితే.. ఇమ్రాన్ హష్మి ముద్దు బోర్ కొట్టడం కాదు.. ఏకంగా అతని సినిమాలే బోర్ కొట్టేయడం విశేషం!
వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ లిస్టును పెంచడంతో.. ఇమ్రాన్ కెరీర్ దిగజారిపోయింది. దీంతో.. క్రమంగా సినిమాల్లో కనిపించకుండా పోయాడీ సీరియల్ కిస్సర్. ఇలాగే ఉంటే.. జనాలు తనను మరిచిపోవడం ఖాయమని డిసైడ్ అయిన హష్మీ.. రూట్ మార్చాడు. హీరో నుంచి ఇతర పాత్రల్లోకి షిఫ్ట్ అయిపోయాడు!
బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ఓ సినిమా చేస్తున్నాడు ఇమ్రాన్. వీరి కాంబినేషన్ లో ‘చెహ్రా’ అని సినిమా తెరకెక్కనుంది. కానీ.. ఆలస్యం అవుతోంది. దీంతో.. గెస్ట్ అప్పియరెన్స్ కు కూడా సిద్ధమయ్యాడు. సల్మాన్ చేస్తోన్న ‘అంతిమ్’ సినిమాలో అతిథి పాత్రకు సైన్ చేశాడు హష్మి. అయితే.. వీరిద్దరికీ అక్కడ లింక్ బాగానే కుదిరినట్టుంది. రాబోయే సినిమాలో మంచి ఛాన్స్ ఇచ్చాడు సల్లూ భాయ్.
సల్మాన్ అప్ కమింగ్ మూవీ ‘టైగర్ 3’లో ఇమ్రాన్ హష్మికి తనను ఢీకొట్టే రోల్ ఆఫర్ చేశాడట! ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందాహై’ సినిమాల సిరీస్ లో రాబోతున్న మూడో చిత్రమిది. మనీష్ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్. ఈ సినిమాలో సల్మాన్ ను ఢీకొనే సీరియస్ విలన్ గా కనిపించబోతున్నాడు ఇమ్రాన్. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో యశ్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా.. మార్చిలో పట్టాలెక్కనుందని సమాచారం.