మూడేళ్లు అయినా నాకేం అసంతృప్తి లేదు: ఎన్టీఆర్

Update: 2021-03-13 17:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో 'ఎవరు మీలో కోటీశ్వరుడు' రియాలిటీ షో ద్వారా వ్యాఖ్యాతగా టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ ఇటీవలే లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ప్రోగ్రాంకు సంబంధించిన విషయాలతో పాటు ఆయన సినిమాలు, పర్సనల్ విషయాలను కూడా బయటపెట్టాడు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఎందుకు సరిగ్గా కనిపించడం లేదనే ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇచ్చాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాతో నాకు అనుబంధం పెద్దగా ఉండదు. ఈ విషయం నేను ఇదివరకే చాలాసార్లు చెప్పడం జరిగింది. అదొక డిఫరెంట్ వరల్డ్. అలాంటి ప్రపంచంలో ఉండటం నావల్ల కాదు. నాకు సోషల్ మీడియా పై పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు.

కానీ నా ఫ్రెండ్స్, నా బృందం.. నా అభిమానులు వారి అభిప్రాయాలను ఆలోచనలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటారు. నేను నా వ్యక్తిగత జీవితం కారణంగా సోషల్ మీడియాకు మూడేళ్లుగా దూరంగా ఉండాల్సి వచ్చింది. చెప్పాలంటే సోషల్ మీడియాలో లేకపోవడం అనేది నాకేమి కోల్పోతున్న ఫీలింగ్ లేదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారితో ఉంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేను. అదే చాలంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇంకా మూడేళ్లుగా యాక్టీవ్ గా లేకపోవడానికి ఆర్ఆర్ఆర్ సినిమా కూడా కారణమే. ఎందుకంటే ఆ సినిమా అంతటైం తీసుకుంది. తెలుగు ప్రజలకోసం పోరాడిన రియల్ హీరోల కథలో భాగం అవ్వడం గర్వంగా ఉంది. నాకు సోషల్ మీడియాలో లేకపోతే అసంతృప్తిగా అనిపించడం లేదు. ఇంకా ఎవరు మీలో కోటీశ్వరులు షోలో జనాలు ఎంత తీసుకెళ్తారో తెలీదు. కానీ లైఫ్ పై కాంఫిడెన్స్ మాత్రం తీసుకెళ్తారనే చెప్పగలను. నా వరకు నేను కాంఫిడెన్స్ పెంచడానికి ట్రై చేస్తాను' అంటూ జవాబిచ్చాడు.
Tags:    

Similar News