ఇలియానా పరిస్థితే రకుల్ కి?
టాలీవుడ్ లో హవా తగ్గకముందే గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ కి ఎగురుకుంటూ వెళ్లింది. కానీ అక్కడా కెరీర్ ఆశించినంతగా సాగలేదు. అక్కడ డజను సినిమాలకే పరిమితమైంది. అందులోనూ స్టార్ హీరోలతో నటించిన చిత్రాలేవీ పెద్దగా లేవు. అనంతరం ఆండ్రూతో ప్రేమాయణం నడిపి కెరీర్ ను మరింత అశ్రద్ద చేసింది. ఇప్పుడు సినిమాల్లేక...బోయ్ ప్రెండ్ లేక ఖాళీగా ఉంటోంది. టాలీవుడ్ లో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేసింది గానీ...ఏ దర్శక నిర్మాత అమ్మడి వైపు చూడనేలేదు.
కనీసం యువ హీరోలు కూడా పట్టించుకోని సన్నివేశం ఎదురైంది. ఐటమ్ సాంగ్స్ చేసే అవకాశం కూడా రాలేదు. తాజాగా దిల్లీ బ్యూటీ రకుల్ ప్రత్ సింగ్ కూడా టాలీవుడ్ లో అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. కెరీర్ ఆరంభం యంగ్ హీరోలతో సినిమాలు చేసినా.. మెల్ల మెల్లగా ట్యాలెంట్ చూపించి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. మహేష్- ఎన్టీఆర్- రామ్ చరణ్- బన్నీ- నాగార్జున ఇలా టాప్ స్లార్ల చిత్రాల్లో నటించింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు లేని పరిస్థితి. అమ్మడు గతేడాది వెటరన్ స్టార్ నాగార్జున తో మన్మధుడు-2లో నటించిన తర్వాత టాలీవుడ్ లో జాడలేదు.
ఇప్పుడు కనీసం యంగ్ హీరోలు కూడా అమ్మడి వైపు చూడటం లేదు. సీనియర్ హీరోలతో నటించడం తనకు మైనస్ అయ్యిందనే భావిస్తున్నారు. ఫ్లాపులు రాగానే ఐరెన్ లెగ్ అంటూ పక్కన పెట్టేశారా? ఇప్పటి యువ హీరోలంతా రాశీఖన్నా- సాయిపల్లవి- నిధి అగర్వాల్ సహా కొత్త నాయికల వెంట పడుతున్నారు తప్ప! రకుల్ వైపు చూసే చూడనేలేదు. కనీసం సీనియర్లు కూడా అవకాశాలివ్వడం లేదు. అంటే రకుల్ రేంజ్ సెకండ్ గ్రేడ్ నాయికల కంటే కిందికి పడి పోయిందా? అన్న సందేహం వ్యక్తం అవుతుంది.
ఇలియానా కెరీర్ తో పోలిస్తే రకుల్ కెరీర్ చాలా చిన్నది. అంత స్టార్ డమ్ కూడా అందుకోలేదు. కానీ డౌన్ ఫాల్ అవుతున్న తీరు చూస్తే తనలానే బౌన్స్ బ్యాక్ అవ్వడం కష్టమేనని అర్థమవుతోంది. ఇప్పటికి కోలీవుడ్.. బాలీవుడ్ లో మాత్రం రకుల్ కొన్ని సినిమాల్లో నటిస్తోంది. అందులో చెప్పుకోదగ్గ చిత్రమేదైనా ఉంది అంటే? అది `ఇండియన్-2` మాత్రమే. ఇందులో ఓ కీలక పాత్రకు అమ్మడిని డైరెక్టర్ శంకర్ ఎంపిక చేసారు.