ఈ ఇయర్ లో అతి పెద్ద జోక్‌ ఇదే

Update: 2015-08-31 19:35 GMT
టాలీవుడ్‌ లో ఇలియానా చివరిసారిగా నటించిన సినిమా 'దేవుడు చేసిన మనుషులు'. ఆ తర్వాత ఇక్కడినుంచి మాయమై బాలీవుడ్‌ లో ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ బర్ఫీతో ఎంట్రీ ఇచ్చి, అటుపై సైఫ్‌ అలీఖాన్‌ సరసన హ్యాపీ ఎండింగ్‌ వరకూ వరుసగా సినిమాల్లో నటించింది. అయితే కెరీర్‌ లో ఆశించిన హిట్‌ దక్కించుకోలేకపోయింది.

ఇటీవలి కాలంలో ఉత్తరాదిన కెరీర్‌ ఆశించిన స్థాయికి వెళ్లకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయింది. అందుకే నన్ను నేను పునరాలోచించుకుంటున్నా.. అంటూ ఏదేదో చెప్పుకొచ్చింది. కావాలనే కెరీర్‌ కి బ్రేక్‌ నిచ్చానని తనంతట తానుగా ఠాం ఠాం వేసుకుంటోంది. సరిగ్గా ఇదే టైమ్‌ లో రామ్‌ చరణ్‌ నటిస్తున్న బ్రూస్ లీ చిత్రంలో ఓ ఐటెమ్‌ నంబర్‌ లో నర్తించేందుకు ఏకంగా 1.5కోట్లు అందుకోబోతోందంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పటికే దర్శకనిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుంది. సెట్స్‌ కెళ్లడమే తరువాయి అని బాలీవుడ్ బాబులు చెబుతున్నారు.

అయితే ఇలియానాకి అంత రేంజుందా? అంత పెద్ద మొత్తాన్ని కేవలం ఐటెమ్‌ కోసం చెల్లించుకోవడం దండగ బాసూ. ఓ ఫ్లాప్‌ హీరోయిన్‌ ని పిలిచి ఇంత పెద్ద ఆఫర్‌ ఇస్తారా? ఈ ఏడాది బిగ్‌ జోక్‌ ఇదే.. అదే ప్రైస్ లో టాప్ గ్రేడ్ బాలీవుడ్ హీరోయిన్  వచ్చేస్తుంది గా  బాబు చెర్రి?
Tags:    

Similar News