గోవా బ్యూటీ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉందా?

Update: 2021-04-30 01:30 GMT
గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. చిన్న హీరోల నుండి స్టార్‌ హీరోల వరకు ఎంతో మందితో కలిసి నటించిన ఇలియానా టాలీవుడ్‌ లో మొదటి కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్ గా కూడా క్రెడిట్ దక్కించుకున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌ లో వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే ఈ అమ్మడికి బాలీవుడ్‌ నుండి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లింది. అక్కడ సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా ఈమె కొనసాగలేక పోయింది. అక్కడ ఈ అమ్మడి హవా కొంత కాలం మాత్రమే కొనసాగింది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఒకటి రెండు చిన్న సినిమాల్లో నటిస్తుంది. ఇదే సమయంలో టాలీవుడ్‌ లేదా కోలీవుడ్ నుండి ఆఫర్ల కోసం ఎదురు చూస్తోంది.

టాలీవుడ్‌ లో ఈమె రవితేజతో కలిసి అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్‌ అవ్వడంతో పాటు ఆ సినిమాలో ఇలియానా లుక్ పై విమర్శలు వచ్చాయి. ఇలియానా లావు అయ్యిందంటూ కామెంట్స్ వచ్చాయి. టాలీవుడ్‌ లో ఆఫర్ల కోసం ఈ అమ్మడు సన్నబడింది. కాని ఆఫర్లు మాత్రం కనిపించడం లేదు. తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడికి ఆఫర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.

ప్రియుడితో బ్రేకప్ తర్వాత ఈమె సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నా కూడా ఆఫర్లు మాత్రం కనిపించడం లేదు. ఈమె సోషల్‌ మీడియాలో హాట్ ఫొటోలను షేర్‌ చేయడంతో పాటు తనకు పరిచయం ఉన్న వారితో మాట్లాడుతూ ఆఫర్లను అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రీ ఎంట్రీ కోసం ఈ అమ్మడు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తోంది. మరి అవి ఎంత వరకు వర్కౌట్‌ అవుతాయి అనేది చూడాలి.
Tags:    

Similar News