ఆ పార్టీలో అన్నేసి పాలిటిక్స్ జరిగాయా??

Update: 2016-12-03 19:30 GMT
ఇప్పుడు ఫిలిం నగర్ లో ఒక పార్టీ గురించి తెగ మాట్లేడేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆ పార్టీలో జరిగిన కొన్ని ఈగోయిస్టిక్ సంఘటనలను చూస్తే.. అసలు మన హీరోలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో అర్ధంకాక జుట్టు పీక్కోవాల్సిందే. ఇంతకీ అదేదో పొలిటికల్ పార్టీ కాదండోయ్.. అది ఒక హీరోయిన్ ఇచ్చిన బర్తడే పార్టీ. పదండి అసలు ఏం జరిగిందో చూద్దాం.

నిజానికి ఈ అమ్మడు ఇప్పుడే ఒక స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. అందుకే తాను ఇప్పటివరకు పనిచేసిన హీరోలందరినీ ఆ పార్టీకి పిలిచింది. కాకపోతే అమ్మడు ఒక పర్టికులర్ ఫ్యామిలీ హీరోలను మాత్రం కాస్త ఎక్కువగానే ఇన్వయిట్ చేసిందట. వారితో పనిచేయకపోయినా కూడా.. ఆమెకు మంచి ర్యాపో ఉండటంతో.. వారందరూ అక్కడికి విచ్చేశారు. ఇదే తరుణంలో ఆమెతో పనిచేసిన కొందరు హీరోలు.. అసలు వాళ్ళను పిలవడం ఏంటి అంటూ కాస్త పెదవి విరిచి.. దూరంగా ఉండిపోయారట. అలాగే సదరు హీరోయిన్ మీద క్రష్‌ తో కాంప్లిమెంట్లు విసిరిన ఒక హీరో కూడా.. వీళ్ళందరూ రావడం వలన అసలు పార్టీ స్పాయిల్ అయ్యింది అన తరహాలో బిహేవ్ చేశాడట. మొత్తానికి ఇవన్నీ కేవలం ఈగో క్లాషెస్ అంతే. వాడొచ్చాడేంటి వీడొచ్చాడేంటి అని ఫీలవ్వకుండా.. చక్కగా అందరూ కలసి ఎంజాయ్ చేయ్యండయ్యా సామీ.

ఇకపోతే ఈ పార్టీలో అందరూ కలసి ఫోటోలు కూడా దిగలేదు. ఎవరి గ్యాంగ్ తో వారు.. విడివిడిగా సదరు భామతో ఫోజులిచ్చారంతే. ఎందుకు బాసూ ఈ రేంజులో ఈగోలు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News