జల్లికట్టుపై కమల్ సెన్షేషనల్ కామెంట్స్!

Update: 2017-01-09 09:58 GMT
సామాజిక, రాజకీయ అంశాలపై సినీనటులు స్పందించడం, వారి వారి అభిప్రాయాలను సూటిగా చెప్పడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుందనే చెప్పాలి. ఈ విషయంలో తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ ఒక విషయంపై స్పందించారు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పై వస్తున్న కామెంట్స్, ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన పై కమల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలిపారు.

సాంప్రదాయ క్రీడ జల్లికట్టు అంటే తనకెంతో అభిమానమని మొదలుపెట్టిన కమల్‌ హాసన్‌ స్పెయిన్ లో జరిగే "బుల్‌ ఫైట్‌" కు జల్లికట్టుకు ఎంతో తేడా ఉందని వివరించే ప్రయత్నం చేశారు. స్పెయిన్ లో జరిగే బుల్‌ ఫైట్స్ లో ఎద్దులను హింసిస్తారని, కొన్ని సందర్భాల్లో అవి మరణించడం కూడా జరుగుతుందని కానీ... జల్లికట్టులో ఈ మూగజీవులకు ఎటువంటి హాని తలపెట్టరని చెప్పిన కమల్... జల్లికట్టును నిషేధించాలనుకుంటే బిర్యానీని కూడా బ్యాన్‌ చేయాలని సూచించారు.

కాగా... సంక్రాంతి సందర్భంగా ఏపీలో ఎక్కువగా కోడి పందాళు జరగడం తెలిసిందే! ఇదే క్రమంలో తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా జల్లికట్టు పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీ! అయితే ఈ విషయంలో జంతువులను హింసిస్తున్నారని, ఈ జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతీ తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని తొలగించాలని తమిళవాసులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుపుతున్నారు. జల్లికట్టుకు అనుకూలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ జల్లికట్టు పై స్పందించారు.. ఈ జల్లికట్టుకు తాను "బిగ్ ఫ్యాన్" అని వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News