ఎలాంటి పాత్రలు చేయడానికైనా నేను రెడీ!
హీరో కమ్ కమెడియన్ సునీల్ - సుక్రాంత్ వీరెల్ల - వైశాలి రాజ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ''కనబడుటలేదు''. ఎమ్. బాలరాజు ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్ ఫిల్మ్స్ - శ్రీ పాద క్రియేషన్స్ - షేడ్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. సాగర్ మంచనూరు - సతీశ్ రాజు - దిలీప్ కూరపాటి - శ్రీనివాస్ కిషన్ అనపు - దేవీ ప్రసాద్ బలివాడ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ వైశాలి రాజ్ ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు...
- హీరోయిన్ గా 'కనబడుటలేదు' నా తొలి చిత్రం. నా స్క్రీన్ నేమ్ వైశాలి రాజ్ అయితే నా అసలు పేరు కవిత. మాది వైజాగ్. పుట్టి పెరిగింది, చదువువంతా వైజాగ్ లోనే సాగింది. నేను జాబ్ చేస్తుండేదాన్ని. నాన్నగారు చనిపోయిన తర్వాత జాబ్ మానేశాను. సినిమాల్లోకి రావడానికి మా అమ్మగారి సపోర్టే కారణం. అప్పుడప్పుడు షార్ట్ ఫిలింస్ లో యాక్ట్ చేసేదాన్ని. రెండేళ్ల ముందు ఓ షార్ట్ ఫిల్మ్ లో నన్ను చూసిన బాలరాజుగారు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు.
- నేనెక్కడా యాక్టింగ్ నేర్చుకోలేదు. ఐదారు షార్ట్ ఫిలింస్ లో యాక్ట్ చేశాను. 'మౌన రాగం' అనే సీరియల్ లో నెగటివ్ రోల్ చేశాను. హీరోయిన్స్ పాత్రలే కాదు, పెర్ఫామెన్స్ కు ప్రాధాన్యం ఉండే పాత్రలైనా చేయడానికి నేను సిద్ధం.
- క్రైమ్ సస్పెన్స్ థ్రిలర్ మూవీ. ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఇది బెస్ట్ అని చెప్పగలను. కచ్చితంగా ఆడియెన్స్ కు నచ్చుతుంది. సునీల్ గారు మెయిన్ రోల్ చేశారు. ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. సునీల్ గారు ఏమనుకుంటారోనని భయపడ్డాను. కానీ ఆయన చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారు.
- సినిమా నా చుట్టూనే రన్ అవుతుంది. ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. మిడిల్ క్లాస్ పక్కింటి అమ్మాయి పాత్రలో నటించాను. పాత్రలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి.
- షార్ట్ ఫిలింస్ ను రెండు, మూడు రోజుల్లో చేస్తాం. అలాగే సీరియల్స్ లోనూ చాలా ఎపిసోడ్స్ ను ఒక రోజులో చేస్తాం. కానీ సినిమాల్లో ఒకటీ రెండు సీన్స్ మాత్రమే చేస్తాం.
- స్టోరీస్ వింటున్నాను. ఈ సినిమా రిలీజ్ తర్వాత చూడాలి. అలానే డైరెక్షన్ చేయాలని ఉంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. నాకు దీపికా పదుకోన్ - నయనతార - సమంత అక్కినేని అంటే చాలా ఇష్టం. వాళ్లు సెలక్ట్ చేసుకునే రోల్స్ నాకు బాగా నచ్చుతాయి.