రిస్క్ చేసే కొత్త దర్శకులంటేనే నాకు ఇష్టం!-ఆయుష్మాన్
ఆ యంగ్ యహీరో ఏదైనా సినిమాలో నటిస్తే అందులోని కీ పాయింట్ జాతీయ స్థాయిలో చర్చకు వస్తుంటుంది. అంతగా ప్రభావితం చేయడం అతడి స్టైల్. ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనంతో నిరంతరం అతడి సినిమాలు హెడ్ లైన్స్ లోకి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడు. ఇంతకీ ఎవరా హీరో? అంటే... ఆయుష్మాన్ ఖురానా. అతడు నటిస్తున్న తాజా చిత్రం డాక్టర్ జి. ఈ సినిమాకి తొలి చిత్ర దర్శకుడితో ఆయుష్మాన్ పని చేస్తున్నారు.
కొత్త దర్శకుడినే ఎంపిక చేయడం ఎందుకు? అని అంటే.. కచ్ఛితంగా కొత్తకుర్రాళ్లు ప్రయోగాత్మక కథలతో ముందుకొస్తారు. అలాంటివే నాకు కూడా ఇష్టం. రిస్క్ చేయకపోయినా.. ప్రమాదాల్లేకయినా నాకు నచ్చదు.. అని ఆయుష్మాన్ అన్నారు. కొత్తతరం హై-రిస్క్ కంటెంట్ ను సృష్టిస్తారని ఇది తనకు నచ్చుతుందని అన్నారు. రిస్కీ ఎంపికలతో ఉండటానికి తాను ఎప్పుడూ ఆకర్షితుడయ్యానని అన్నారు.
ఆయుష్మాన్ ఇప్పటికే చాలామంది కొత్త దర్శకులతో పని చేశారు. ఇప్పుడు డాక్టర్ జి కోసం అతను మళ్ళీ తొలి చిత్ర దర్శకుడు అనుభూతి కశ్యప్ తో కలిసి పనిచేస్తున్నాడు. ఇందులో ఆయుష్మాన్ గైనకాలజిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సోషల్ కామెడీ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది.
తొమ్మిదేళ్లుగా సినీ పరిశ్రమను శాసిస్తున్న ఆయుష్మాన్ ప్రతిసారీ.. శుద్ధి చేసిన ముడి సరుకును ఎంచుకుంటాడు. ప్రతిభను ఎప్పటికప్పుడు ఎంచుకుంటాడు. అందుకే విజయం గ్యారెంటీగా తనను చేరుతుంది.
2017లో అక్షయ్ రాయ్ `మేరీ ప్యారీ బిందు`.. ఆ తర్వాత 2019 లో రాజ్ షాండిల్య `డ్రీమ్ గర్ల్` .. 2020 లో హితేష్ కేవల్య `శుభ్ మంగల్ జ్యాదా సావధాన్`లో నటించాడు ఆయుష్మాన్. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. ప్రస్తుతం డాక్టర్ జి కాకుండా అభిషేక్ కపూర్ చిత్రం చండీఘర్ కరే ఆషికిలో నటిస్తున్నారు. వాణీ కపూర్ తో పాటు అనుభవ్ సిన్హా `అనెక్`లో కూడా కనిపిస్తున్నారు.