'పుష్ప' విషయంలో నా టెన్షన్ నాకు ఉంది: సునీల్

Update: 2021-12-13 03:11 GMT
'పుష్ప' సినిమాలో సునీల్ 'మంగళం శ్రీను పాత్రలో నటించాడు. నిన్న రాత్రి  జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ, "మీ అందరికీ గుర్తుందో లేదో .. ఇదే ప్లేస్ లో నేను నుంచుని, ఆ రోజున కూడా ఎదురుగా అల్లు అర్జున్ గారే ఉన్నారు .. యాంకర్ గా సుమగారే ఉన్నారు. 'అల వైకుంఠపురములో' ఫంక్షన్లో చెప్పాను. ఆ సినిమా మంచి పెళ్లి భోజనం తిన్నట్టుగా ఉంటుందని. మేమందరం మీ ఇళ్లకి పండగకి వస్తున్నాం .. మీరు టిక్కెట్టు కొంటే చాలు అని. ఆ సినిమా పెళ్లి లాంటిది గనుక పెళ్లి భోజనం పెట్టాము. పెళ్లి అయిపోయిన తరువాత రిసెప్షన్ మీల్స్ లా ఉంటుంది ఈ సినిమా.  

మంచి దావతు .. మంచి నాన్ వెజ్ మీల్స్ .. సో పెళ్లి మిస్ అయినా ఫరవాలేదు గానీ, రిసెప్షన్ లో కక్కా ముక్కా మిస్ కాకూడదు. అందుగురించి చెబుతున్నాను. అలా ఆ రోజున ఆ సినిమా థియేటర్లలో నుంచి  బయటికి వస్తూ మీరంతా హ్యాపీగా ఉన్నారో, ఈ సినిమాకి వెళ్లి వచ్చిన తరువాత కూడా వన్ వీక్ అయినా ఆర్టిస్టులందరూ మీకు గుర్తుకు వస్తూనే ఉంటారు. మామూలుగా ఎవరైనా విలన్ గా నటించాలంటే డైరెక్టుగా ట్రై చేస్తారు. అయితే అందుకు ఐదారేళ్లు పట్టొచ్చు. అప్పుడు వాళ్లు విలన్ అవుతారు. కానీ నేను సినిమాలో విలన్ కావడానికి ముందు 300 సినిమాల్లో కమెడియన్ గా చేసి, ఓ 10 సినిమాల్లో హీరోగా చేస్తేనే గాని విలన్ ను కాలేదు.

సిక్స్ ప్యాక్ చూపించినా హీరోను అయ్యానే గానీ .. విలన్ ను కాలేకపోయాను. ఈ కోరికను తీర్చిన సుకుమార్ గారికీ .. దానిని బలంగా పట్టుకున్న అల్లు అర్జున్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. భయ్యా .. ఇంతకుముందు నేను చేసిన సినిమాలను గుర్తుచేసుకుని ఈ సినిమాలో నన్ను చూడొద్దు. ఈ సినిమాలో నన్ను కొత్తగా చూడండి. మీరు కొత్తగా చూస్తేనే నేను కొత్తగా చేయగలను. మిగతా లాంగ్వేజెస్ లో నాకు టెన్షన్ లేదు. ఎందుకంటే నన్ను ఫస్టు టైమ్ చూస్తున్నారు వాళ్లు .. డైరెక్ట్ గా విలన్ అనే అనుకుంటారు .. నాకు ఇక్కడే టెన్షను.

అవసరమైతే తరువాత నవ్విస్తాను .. ఈ సినిమా వరకూ మాత్రం మిమ్మల్ని కొంచెం భయపెడతాను .. కొంచెం భరించండి.బన్నీ కేరక్టర్ చిన్న పిల్లల వరకూ వెళ్లిపోయింది. మా అబ్బాయి పుష్పలానే కాస్త వంగి నడుస్తున్నాడు. 'ఒరేయ్ నీకు సెట్ అవ్వలేదురా' అంటే . 'తగ్గేదే లే' అంటున్నాడు. గెడ్డం .. మీసాలు వచ్చిన తరువాత చెప్పారా .. నువ్వు గెడ్డం కింద చేయి పెట్టి అలా అంటే క్రీమ్ రాసినట్టుగా ఉందిరా అని నేను అనేవాడిని. చాలా చాలా థ్యాంక్స్ భయ్యా .. ఆల్ ది బెస్ట్ అందరికీ" అంటూ ముగించాడు.
Tags:    

Similar News