• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చందూ మొండేటి తర్వాత...

చందూ మొండేటి తర్వాత ఎవరితో అంటే..

By - Tupaki Desk
Update: 2016-09-03 12:45 GMT
‘కార్తికేయ’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు చందూ మొండేటి. అతడి టాలెంట్ చూసి వెంటనే తన దగ్గరికి పిలిపించుకున్నాడు అక్కినేని నాగార్జున. నాగచైతన్య హీరోగా ‘ప్రేమమ్’ తెరకెక్కించే బాధ్యత అతడికి అప్పగించాడు. ఈ సినిమా మంచి అంచనాల మధ్య దసరాకు విడుదల కాబోతుంది. చందూ ద్వితీయ విఘ్నాన్ని ఎలా అధిగమిస్తాడో చూడాలి. ఐతే ‘ప్రేమమ్’ రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఇంతలోనే తన  మూడో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు చందూ. అతడి కోసం ఓ కొత్త నిర్మాణ సంస్థ తెరమీదికి వచ్చింది.

ఇప్పటికే మీడియా రంగంలో.. డిస్ట్రిబ్యూషన్లో తనదైన ముద్ర వేసిన ‘ఐ డ్రీమ్ మీడియా’ సంస్థ చందూ తర్వాతి సినిమాను నిర్మించనుంది. ఆ సంస్థకిదే తొలి సినిమా. వాసుదేవరెడ్డి చిన్నా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ‘‘ఐ డ్రీమ్ సంస్థప్రొడ్యూస్ చేస్తున్న తొలి చిత్రాన్ని నేను డైరెక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వాసుదేవరెడ్డి.. రాజ్ కుమార్ ఆకెళ్లలతో నాకు చాలా కాలంగా అనుబంధం ఉంది. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి వేగంగా మారుతోంది. గత కొన్నేళ్లలో సృజనాత్మక రంగంలో అనేక మార్పులొచ్చాయి. ఈ సినిమా ఈ ఏడాది ఆఖర్లో సెట్స్ మీదికి వెళ్తుంది. నటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చందూ చెప్పాడు. ‘ఐడ్రీమ్ మీడియా’ వ్యవస్థాపకుడు.. సీఈవో వాసుదేవరెడ్డి మాట్టాడుతూ.. ‘‘చందు తర్వాతి సినిమాను మేం నిర్మిస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. చందూ టాలెంటెడ్ డైరెక్టర్. సరికొత్త సినిమాలు తీయాలని తపిస్తాడు. అలాంటి దర్శకుల్ని నమ్మాలి’’ అన్నాడు.
Tags:    
  • I Dream Media 
  • Chandoo Mondeti 
  • Telugu NEws 

Similar News

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

Copyright @2026

Powered by Blink CMS