వాళ్లు చేసిన చీటింగ్‌ తో పెళ్లిపై ఆసక్తి పోయిందంటున్న హీరోయిన్‌

Update: 2020-07-31 07:50 GMT
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన పూర్ణ ప్రస్తుతం సినిమాల కంటే బుల్లి తెరపై సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. హీరోయిన్‌ గా చేసిన సినిమాలు ఏమీ కూడా పెద్దగా సక్సెస్‌ కాకపోవడంతో పాటు హీరోయిన్‌ గా స్టార్‌ డం తీసుకు రాకపోవడంతో పూర్ణ హీరోయిన్‌ గా చాలా స్పీడ్‌ గా ఫేడ్‌ ఔట్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రత్యేక పాత్రలు ఐటెం సాంగ్స్‌ కు కూడా ఓకే చెప్పినా కూడా ఈ అమ్మడికి ఆఫర్లు రాలేదు. సినిమాల్లో ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ అమ్మడికి ‘ఢీ’ డాన్స్‌ షో లో జడ్జ్‌ గా వ్యవహరించే అవకాశం దక్కింది.

గత రెండు సంవత్సరాలుగా ఢీ లో జడ్జ్‌ గా వ్యవహరిస్తున్న పూర్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కొన్నాళ్ల క్రితం కొందరు నన్ను నా కుటుంబంను పెళ్లి పేరుతో చీట్‌ చేశారు. వారు చేసిన పనితో నాకు పెళ్లి అంటేనే ఆసక్తి పోయిందని చెప్పుకొచ్చింది.

పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత ఆ సమయంలో పూర్ణ పెళ్లి క్యాన్సిల్‌ అయ్యి ఉంటుందని అందుకే ఆమెకు పెళ్లి పై ఆసక్తి పోయి ఉంటుందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ప్రస్తుతంకు పెళ్లిపై ఆసక్తి లేని పూర్ణ భవిష్యత్తులో తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేకపోలేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం మళ్లీ నటనపై దృష్టి పెట్టిన పూర్ణ సెకండ్‌ ఇన్నింగ్స్‌ తో అయినా ఆకట్టుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News