• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరోయినూ కాస్టింగ్ కౌచ్...

ఆ హీరోయినూ కాస్టింగ్ కౌచ్ బాధితురాలేనట

By - Tupaki Desk
Update: 2018-05-13 07:17 GMT
కాస్టింగ్ కౌచ్.. గత ఏడాది కాలం నుంచి దీని గురించి ప్రపంచ స్థాయిలో పెద్ద చర్చే నడుస్తోంది. హాలీవుడ్లో పెద్ద పెద్ద కథానాయికలు దీనిపై స్పందించారు. సినీ పరిశ్రమలో ఎదురైన లైంగిక వేధింపులు.. చేదు అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలో కొందరి అనుభవాలు షాకింగ్ గా అనిపించాయి. పలువురు బాలీవుడ్.. టాలీవుడ్ హీరోయిన్లు సైతం ఈ అంశంపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఐతే చాలామంది హీరోయిన్లు రొటీన్ గా ఈ కౌచ్ అన్నది సినిమా పరిశ్రమకే పరిమితం కాదు.. అన్ని చోట్లా ఉన్నదే అనడం చూశాం. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి కూడా ఈ అంశంపై మాట్లాడింది. తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలే అని ఆమె చెప్పింది. ఐతే తాను కేవలం సినిమా పరిశ్రమ నుంచే కాక వేరే రంగాల వ్యక్తుల నుంచి కూడా వేధింపులు ఎదుర్కొన్నట్లు హ్యూమా చెప్పడం గమనార్హం.

సినీ పరిశ్రమలో పేరున్న వాళ్లందరూ అమ్మాయిల్ని లోబరుచుకోవడానికి కాస్టింగ్ కౌచ్ ను ఒక ఆయుధంలాగా ఉపయోగించుకుంటారని హ్యూమా చెప్పింది. కెరీర్ ఆరంభం నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నానని.. సినిమాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆమె అంది. కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్లు టార్గెట్ అయిపోతారని.. ఏదో తప్పు చేసిన భావన కలిగిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఇలాంటి అనుభవాలకు గురయ్యామని అంటేనే అమ్మాయిలపై ఒక చెడు ముద్ర పడిపోతుందని.. వాళ్ల క్యారెక్టర్లపై ఒక అంచనాకు వచ్చేస్తారని.. ఇది బాధాకరమని హ్యూమా అభిప్రాయపడింది. బాలీవుడ్లో గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్.. డి-డే.. బద్లాపూర్ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన హ్యూమా.. దక్షిణాదిన తొలిసారిగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించిన ‘కాలా’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
Tags:    
  • Huma Qureshi 
  • casting couch 
  • Telugu News 
  • Telugu CInema News 
  • Tollywood 

Similar News

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

Copyright @2026

Powered by Blink CMS