షకీలా పేరుకు ఉన్న పవర్ అర్ధమైందా?

Update: 2016-06-11 09:20 GMT
ఇప్పుడు దేశవ్యాప్తంగా బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. స్పోర్ట్స్ పర్సనాలిటీలపై తెగ సినిమాలు వచ్చేస్తున్నాయి. అయితే ఓ ఐటెం గాళ్ పై మాత్రం చివరగా వచ్చిన బయోపిక్ డర్టీ పిక్చర్. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన ఈ మూవీకి.. దేశవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ వచ్చింది. మల్లూ అంటీ అనే పదానికి విపరీతమైన పాపులారిటీ తెచ్చిన షకీలా లైఫ్ స్టోరీపై ఓ సినిమాకి రంగం సిద్దమవుతోంది.

బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీతో షకీలా పాత్ర చేయించబోతున్నారని సమాచారం. కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ షకీలా బయోపిక్ ని తెరకెక్కించేదుకు సిద్ధమవుతున్నాడు. గతంలో ఇతను తీసిన లవ్ యూ ఆలియా మూవీలో.. షకీలాతో పాటు సన్నీలియోన్ కూడా కేమియో రోల్స్ చేశారు. అప్పటి నుంచి షకీలా బయోపిక్ చర్చల్లో ఉంది. సన్నీతో ఈ పాత్ర చేయిస్తారని మొదటి నుంచి టాక్ ఉంది. అయితే.. ఇప్పుడీ రోల్ లోకి హ్యూమాని ఫైనల్ చేశారని అంటున్నారు.

గ్యాంగ్సా ఆఫ్ వసేపూర్ చిత్రంతో బిజీగా మారిన హ్యూమా.. షకీలా పాత్రను పోషించేందుకు సై అందని సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న నటి షకీలా. ఈమె జీవిత చరిత్రతో సినిమా అనగానే.. అన్ని ఇండస్ట్రీలో అలర్ట్ అయ్యాయి. ప్రాజెక్ట్ అనుకుంటూ ఉండగానే ఎంక్వైరీలు స్టార్ట్ అయ్యాయంటే.. షకీలా అన్న పదానికి ఉన్న పవర్ ఏంటో అర్ధమవుతుంది.
Tags:    

Similar News