• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘సైరా’లో రజనీ హీరోయిన్?

‘సైరా’లో రజనీ హీరోయిన్?

By - Tupaki Desk
Update: 2018-06-25 08:13 GMT
బాలీవుడ్లో ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్-2’ సహా మంచి మంచి సినిమాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకుంది హ్యూమా ఖురేషి. ఆమె ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ సినిమాతో దక్షిణాదిన అడుగుపెట్టింది. ఈ చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. హ్యూమా నటన ఆకట్టుకుంది. దీని తర్వాత హ్యూమా సౌత్ లో మరో భారీ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లో హ్యూమా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే ఆమెకు ఆ పాత్ర గురించి చెప్పి ఒప్పించారట. అగ్రిమెంట్ కూడా కుదిరినట్లు తెలుస్తోంది.

‘సైరా’లో నయనతార ప్రధాన కథానాయికగా నటిస్తోంది. తమన్నాకు కూడా ఇందులో ఓ కీలక పాత్ర ఇచ్చారు. ఐతే ఇందులో మరో హీరోయిన్‌ కు కూడా చోటుందట. దానికి ఎవరిని ఎంచుకుందామా అని చూస్తున్న చిత్ర బృందానికి ‘కాలా’తో సత్తా చాటుకున్న హ్యూమా కనిపించింది. చిరు పక్కన ఈ తరం హీరోయిన్లను సెట్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడకు ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురినీ సినిమాలో చూపించే అవకాశముంది. హ్యూమా ఒక భార్యగా కనిపించే అవకాశమన్నట్లు చెబుతున్నారు. తమన్నాది మాత్రం భార్య పాత్ర కాదని సమాచారం. ఈ చిత్రం కోసం భారీ షెడ్యూల్ కొన్ని రోజుల కిందటే మొదలైంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట.
Tags:    
  • Huma Qureshi 
  • Chiranjeevi Sye Raa Movie 

Similar News

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS